English Version
  6 Oct, 2017
Home / Entertainment & Reviews / మంచు లక్ష్మీకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన మహిళ!

మంచు లక్ష్మీకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన మహిళ!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : గురువారం రాత్రి. సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో…హైటెక్స్ ప్రాంతమంతా ట్రాఫిక్ జాంతో నిండిపోయింది. వాహనాలు ఇంచి కదిలే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో జస్టిస్ రమణ, వసంత నాగేశ్వరరావు లాంటి ప్రముఖుల కుటుంబాల వివాహాలు జరుగుతున్నాయి. వచ్చిపోయే వీఐపీలతో ఆ ప్రాంతం కార్లతో కిక్కిరిపోయింది. ఆ జాంలో మంచులక్ష్మీ కూడా ఇరుక్కుపోయారు. వీళ్లు ఇలా ఉండగానే పొలిటికల్ ప్రముఖులు యథేచ్చగా వచ్చిపోతున్నారు. కుయ్ కుయ్ మంటు వాళ్ల వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతున్నాయి. వాళ్ల రాకకోసం మిగతా వాహనాలను ఆపేశారు. అలా ఆగిపోయిన వారిలో లక్ష్మీ కూడా ఉన్నారు. ఇలా గంటన్నర పాటు ఆవిడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారట. దీంతో చిర్రెత్తుకొచ్చి ఆమె ఒక ట్వీట్ చేశారు. పొలిటీషియన్లు ప్రోటోకాల్ పక్కన పెట్టి వస్తే మా కష్టాలు తెలుస్తాయి… ట్రాఫిక్ లో ఇరుక్కుంటే అప్పుడు వాళ్లకు తెలిసొస్తుందన్న అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేశారు. దీనికి మరో మహిళ రిప్లై ఇచ్చారు. తిరుమల దర్శనానికి మీరు కూడా ఎల్ 1 కాకుండా సాధారణ జనంలా క్యూలైన్ లో రండి…అప్పుడు మా కష్టాలేంటో మీకు కూడా తెలుస్తాయి…అని సదరు మహిళ లక్ష్మీకి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తిరుమల వెంకటేశ్వరుడు మా పెదనాన్న అని గతంలో లక్ష్మీ చెప్పిన విషయం తెలిసిందే. ఆమె చాలా తరచుగా తిరుమల వెళుతుంటారు. ఆ విషయం పక్కన పెడితే…పెళ్లిళ్ల సందర్భంగా మాదాపూర్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జాం కావడం పై సాధారణ పౌరులు చాలా మంది తిట్టుకోవడం కనిపించింది. ఫ్లై ఓవర్ ల పై ట్రాఫిక్ జాం కావడం హైదరాబాద్ లో ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ఎంత వరెస్ట్ గా ఉందో చెప్పకనే చెబుతోంది.

Your Comments / Feedback