English Version
  4 Oct, 2017
Home / Entertainment & Reviews / భారతీయుడు పార్టీ వచ్చేస్తోంది!

భారతీయుడు పార్టీ వచ్చేస్తోంది!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: సినీ నటుడు కమల్ హాసన్ ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారైంది. నవంబర్ ఏడున కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆ రోజు కమల్ బర్త్ డే. తన జన్మదినమే రాజకీయ పార్టీ స్థాపనకు సరైన ముహూర్తమని కమల్ భావిస్తున్నారట. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఏఐడీఎంకే చిన్నాభిన్నమవుతోన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకేకు పోటీగా ఓ రాజకీయ వేదికకు అవకాశం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో రాజకీయ అరంగేట్రం చేస్తే ఎలా ఉంటుందని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆలోచన చేశారు. అభిమానులు, సన్నిహితులతో మంతనాలు మొదలు పెట్టారు. వ్యవహారం తేల్చకుండా బోర్ కొట్టించే పరిస్థితి తెచ్చారు. బీజేపీతో కూడా రాయబారాలు నడిపారు. అంతలో సడెన్ గా కమల్ రంగ ప్రవేశం చేశారు. తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. రజనీ పై సెటైరికల్ విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీకి ప్రత్యర్థులైన కేజ్రీవాల్ లాంటి వారితో భేటీ అయ్యారు. తాజాగా రజనీ వ్యవహారం తేలకముందే కమల్ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం కూడా డిసైడ్ చేశారు. ఈ ఇద్దరు తమిళ తంబిల కథ ఏ కంచికి చేరుతుందో చూద్దాం!

Your Comments / Feedback