English Version
  9 Oct, 2017
Home / All in one / బాధితులారా… చెప్పండి!

బాధితులారా… చెప్పండి!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : అగ్రీగోల్డ్ కుంభకోణానికి సంబంధించి సీఐడీ విచారణలో కీలక పురోగతి ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఏపీలో మొత్తం 19 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, వాళంతా ప్రొటక్షన్ ఆఫ్ ఏపీ డిపాజిటర్స్ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని డీజీపీ కోరారు. ఇప్పటికే 9.9 లక్షల మంది ఇలా పేర్లు నమోదు చేసుకున్నారని, మిగతా వారు కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం ఈ నెల 12 నుంచి క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ మొదలు పెడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, మండల కేంద్రాలలో దీనికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు డీజీపీ ప్రకటించారు. ఈ కేంద్రాలలో బాధితుల పేర్ల నమోదుతో పాటు, వారి వద్ద ఉన్న దృవ పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా వారి వద్ద ఉన్న పత్రాలతో ఈ కేంద్రాలలో హాజరుకావాలని కోరారు. బాధితులు మోసపోయిన మొత్తాన్ని తెలుపుతూ, కచ్చితమైన వివరాలతో నివేదిక సిద్ధం చేస్తామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు బాధితులందరికీ న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.

Your Comments / Feedback