English Version
  26 Sep, 2017
Home / All in one / “బంగారు? తెలంగాణ”లో ఏం జరుగుతోంది!?

“బంగారు? తెలంగాణ”లో ఏం జరుగుతోంది!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: నిన్న మంత్రి మహేందర్ రెడ్డి సాక్షిగా ఓ ముస్లీం సోదరుడు ఆత్మహత్యాయత్నం. తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి కార్యాలయం ముందు ఇద్దరు దళితుల ఆత్మహత్యాయత్నం…అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? బంగారు పూత వెనుక వాస్తవ దృశ్యం ఏమిటి? ఇవే ఇప్పుడు మౌలిక ప్రశ్నలు. మేథో సమాజం కళ్లు తెరవాల్సిన సందర్భం ఇది. తమ అవసరాలు, చిన్న చిన్న కోరికల కోసం ప్రాణాలకు తెగించే పరిస్థితి రావడం కచ్చితంగా మేథావి వర్గం ఆలోచన చేయాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రం కోసం…రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ఉన్నతి కోసం సర్వం కోల్పోయిన వర్గాలు దిక్కుతోచక ఆత్మహత్యలను ఆశ్రయిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. నామినేటెడ్ పదవి కోసం హుస్సేన్ ఆత్మహత్య యత్నం చేసుకున్నారని చెబుతున్నారు. కానీ, ఎమ్మెల్యే రసమయి కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడిన పరుశురాములు, మహంకాళి శ్రీనివాసులు కథ నేపథ్యం వేరు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెబుతోన్న మూడెకరాల భూమి పథకంలో న్యాయం జరగలేదని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి వేధింపులే ఘటనకు కారణమని మంత్రి ఈటెల చెబుతున్నారు. నేపథ్యం ఏదైనా తెలంగాణలో దళితులు, బలహీనవర్గాల దుస్థితికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి.

Your Comments / Feedback