English Version
  26 Sep, 2017
Home / Entertainment & Reviews / ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నలిగిపోతున్న ప్రిన్స్!

ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నలిగిపోతున్న ప్రిన్స్!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ప్రిన్స్ మహేష్ బాబును ఫ్యామిలీ మెంబర్స్ ఆడేసుకుంటున్నారు. ఆయన మద్ధతు మాకంటే మాకంటూ వాదప్రతివాదనలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న మహేష్ మద్దతు వైఎస్ఆర్సీపీకే అని ఆయన బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తేల్చారు. తాజాగా మహేష్ బావ గల్లా జయదేవ్ రంగంలోకి దిగారు. మహేష్ కు రాజకీయాలతో సంబంధం లేదంటూనే ఆయన మద్దతు టీడీపీకేనని స్పష్టం చేశారు. కృష్ణ, మహేష్ ల మద్దతుతోనే తాను ఎంపీగా గెలిచానని చెప్పారు. సో మొత్తం మీద మహేష్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వాటిపై ప్రిన్స్ పెద్దగా వివరణ ఇవ్వరు కాబట్టి, ఆయన నోరు తెరిచి చెప్పే వరకు ఎవరి వాదనను వారు కొనసాగించే అవకాశం ఉంది. మరి ఫ్యాన్స్ ఎవరి వాదనను సమర్ధిస్తారన్నది చూడాలి. మహేష్ ఎలాగూ చెప్పరు కనుక…ఎవరికి నచ్చిన పార్టీకి వారు మద్దతిచ్చుకుంటారేమో!!

Your Comments / Feedback