English Version
  26 Sep, 2017
Home / Politics / ప్రముఖులకు నో ఎంట్రీ!

ప్రముఖులకు నో ఎంట్రీ!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ఆ ఆసుపత్రిలోకి ప్రముఖులను అనుమతించ లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతల నుంచి పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్ల వరకు ఎవరొచ్చినా నో ఎంట్రీ అని చెప్పేసింది ఆసుపత్రి యాజమాన్యం. ఇంతకీ ఈ ఆసుపత్రి ఎక్కడుంది? ప్రముఖులకు రెడ్ కార్పెట్ పరిచే ప్రైవేటు ఆసుపత్రి ఇక్కడ మాత్రం రెడ్ సిగ్నల్ చూపించడం ఏమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం…తెలంగాణలో మూడెకరాల భూ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని, తమకు అన్యాయం చేశారని సిద్ధిపేట జిల్లా, బెజ్జంకి మండలం, గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు దళిత యువకులు మహంకాళి శ్రీనివాస్, పరశురాములు స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ముందు పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం వారిని సికింద్రాబాద్ లోని యశోధ ఆసుపత్రికి తరలించింది. సహజంగా ఇలాంటి కేసులను నిమ్స్ కు తరలిస్తుంటారు. ఆ విషయం అటుంచితే…యశోధలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఉత్తమ్ లతో పాటు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మరోనేత రావుల చంద్రశేఖర్ రెడ్డిలు యశోధకు వెళ్లారు. అయితే, ఈ ప్రముఖులెవరినీ ఆసుపత్రి యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో వారిపై రేవంత్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు ఏమైనా జరగరానిది జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి అక్కడ నుంచి వెనుతిరిగారు.

Your Comments / Feedback