English Version
  26 Sep, 2017
Home / All in one / ప్చ్…పీకే మంత్రం ఫలించలేదు!

ప్చ్…పీకే మంత్రం ఫలించలేదు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ప్లీనరీ తో తొలి సారి వైసీపీ వేదిక పై కనిపించిన ప్రశాంత్ కిషోర్ పై పెద్ద చర్చే జరిగింది. వైసీపీ తరుపున అతను డీల్ చేసిన మొదటి ఎన్నిక కూడా నంద్యాలే. జగన్ చాలా కష్టపడ్డారు….పార్టీ కూడా బాగా పనిచేసింది. కాపులు, బీసీలు, ముస్లిం లు, వైశ్యులు..ఇలా అన్ని వర్గాలు ఉండడం తో ఎన్నిక మరింత ఆసక్తి గా మారింది. కానీ ఫలితం టీడీపీ కి దక్కింది. దీంతో జగన్ ఆశలు పెట్టుకున్న, అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పీకే వ్యూహాలు పనిచేయలేదు అనే చర్చ మొదలయ్యింది. దీంతో నంద్యాల ఉప ఎన్నిక పీకే ఓటమి….ఇంకా చెప్పాలంటే పీకే తొలి ఓటమి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఇప్పుడు జగన్ ఏంచేస్తారు…ప్రశాంత్ కు అదే ప్రాధాన్యం ఇస్తారా…పక్కన పెట్టేస్తారా…ఇది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

Your Comments / Feedback