English Version
  26 Sep, 2017
Home / All in one / పిచ్చుక గూట్లో కమలం!!

పిచ్చుక గూట్లో కమలం!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: వెనకటకు ఓ మధ్య తరగతి పిల్లగాడికి పేద్ద కోరిక పుట్టింది! సముద్రం ఒడ్డున ఏడంతస్తుల మేడ కట్టుకోవాలని తెగ ఉబలాటపడ్డాడు. అనుకున్నదే తడవుగా ప్రయత్నం మొదలు పెట్టాడు. హస్తిన నుంచి పెద్ద ఇంజనీర్లును పట్టుకువచ్చి పెద్ద పెద్ద ప్లాన్లు గీయించాడు. ఆ ఇంజనీరు ఈ పిల్లగాడు కోరినట్టుగానే ఏడంతస్తున మేడంటే ఇలా ఉండాలంటూ అద్భుతమైన కలల ప్రపంచాన్ని గీసిచ్చివెళ్లాడు. ఆ ప్లాన్ పట్టుకుని ఈ పిల్లగాడు సముద్రపు ఒడ్డున ఇసుకలో మేడ కట్టడం మొదలు పెట్టాడు. కొంత కాలం గడచిన తర్వాత చూస్తే తాను కడుతున్నది ఏడంతస్తుల మేడ కాదు…పిచ్చుకగూడు అన్న విషయం క్రమంగా అర్థమవుతూ వచ్చింది. ఇంతలో బహుదూరం నుంచి పిల్లగాడి ఫ్రెండొకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ పిచ్చుకగూడు మీద దూకి పారిపోయాడు. ఇంకేముంది అదికాస్తా ఇసుకమట్టమైంది! ఈ కథను యథాతథంగా రాష్ట్ర బీజేపీకి అన్వయించి చూడండి. ఇక టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ విషయానికి వద్దాం. ఈ రాష్ట్రంలో బీజేపీ అవసరం లేదని ఆయన తేల్చేశారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన బీహార్ మంత్రులు, బీజేపీ నేతలు ఇద్దరు చేసిన ఘన కార్య నేపథ్యంలో రేవంత్ ఈ ప్రకటన చేశారు. కేసీఆర్ పాలన పై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తెగ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పాలన దేశానికే ఆదర్శమన్నారు. శివుడి తలపై నుంచి గంగను భువి పైకి దించిన భగీరథ ప్రయత్నంతో మిషన్ భగీరథను పోల్చారు. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే మరో కోణంలో పొగడ్తలు కురిపించారు. కేసీఆర్ కిట్ల పథకం అద్భుతమని, బీహార్ లో కూడా దీనిని అమలు చేస్తామంటూ…పోతూ పోతూ ఓ కిట్ ను చంకన పెట్టుకుపోయారు. ఈ ఇరువురు బీజేపీ అగ్రనేతలు కేసీఆర్ పాలనను అంతలా పొగిడాక…ఇక ప్రత్యామ్నయం మేమేనంటూ రాష్ట్ర బీజేపీ ఎంత కాకిగోల చేస్తే మాత్రం ఏం లాభం చెప్పండి!?

Your Comments / Feedback