English Version
  8 Oct, 2017
Home / Entertainment & Reviews / పవర్ స్టార్ కు అశోక్ అభిమాని లేఖ.

పవర్ స్టార్ కు అశోక్ అభిమాని లేఖ.

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్ : సినీ నటులు, పాపులర్ పొలిటీషియన్లకు వ్యతిరేకంగా ఎవరైనా ఎవరైనా కామెంట్స్ చేస్తే వారి అభిమానులు రెచ్చిపోవడం చూస్తుంటాం…కానీ, ఓ నికార్సైన నిజాయితీ పరుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు మద్దతుగా ఓ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో మీరే చూడండి.

డియర్ పీకే ఫ్యాన్స్ :

మీకు పవన్ దేవుడు.. ఆయన మీద మీ భక్తి.. పరిధులు దాటి జనాలకు విరక్తి కలిగిస్తోంది. కళ్లు మూసుకుని దేవుడిని ధ్యానించడమంటే.. మనసు దేవుడి మీద పెట్టమని…అంతే కానీ..మీ లాగా కళ్లు మూసుకుపొమ్మని కాదు. ఆకాశం మీద ఉమ్మేస్సే ఏమవుద్ది…మన మీదే పడుద్ది..! మరి అశోక్ గజపతి రాజు మీద అరిస్తే.. ఏమవుద్ది…? మన చాటే చిరుగుద్జి..! అన్నీ సక్రమంగా ఉన్నోళ్లే ఆయన గురించి మాట్లాడ్డానికి జంకుతారు. మరి మనం నోటికొచ్చినట్లు వాగుతున్నాం..? అశోక్ మీద మాట్లాడ్డం అంటే పక్కోడి ఫంక్షన్లకు వెళ్లి “జై పవర్ స్టార్” అని అరవడం కాదు..! పరాయి హీరోల ఫంక్షన్లలో అల్లరి పనులు చేయకూడదని…మీకు… పబ్లిక్ లో మంచి ఇమేజ్ ఉన్న నాయకులపై చిల్లర మాటలు మాట్లాడకూడదని మీ నాయకుడికీ తెలీదు..!
ఏంటి… విశ్వాసం లేని కుక్కా..?
అసలు ఆయనింట్లో కుక్క పాటి విలువ చేస్తాయా.. మీ బతుకులు..!? ఆయన్ను మీరు గెలిపించారా…? సొంత అన్నని.. బావనే గెలిపించుకోలేకపోయారు.. ఆయన్ను మీరు గెలిపిస్తారా..? అశోక్ తో మీకు పోలికెందుకు..? సొంతూరులోనే చెల్లని మొహాలు మీవి..! కానీ మొత్తం విజయనగరానికే రాజు అతను..! రాష్ట్రం మొత్తం కూడా…ఆరాధిస్తుంది. మీలాగా సినిమా హీరో కాదు.. రియల్ హీరో అన్ని విషయాల్లో..!

నోటికొచ్చిన వాగుతున్న మీకు అశోక్ ఎవరో తెలుసా..?
పూసపాటి గజపతి రాజు కొడుకు..!
పివిజి రాజు పట్టాభిషిక్తుడైన చివరి విజయనగర రాజు.. వాళ్ల గురించి చెబితే పేజీలు సరిపోవు..! ఉన్న ఊళ్లో ఇంటిని గ్రంథాలయానికి ఇమ్మంటే అమ్ముకున్న ఘనత మీది.. ! సగం ఊరిని దానంగా ఇచ్చిన చరిత్ర వాళ్లది..! కొన్ని వందల దుకాణాలను.. పది.. పాతిక అద్దెలకు వదిలేసిన కుటుంబం అది.. వేల ఎకరాలను .. కోట్ల ఆస్తులను ధారాధత్తం చేసిన కుటుంబం అది..! బంగాళాలను కోటలను కళాశాలకు ఇచ్చేసి.. సాధారణ జీవనం గడుపుతున్న వ్యక్తి అతను.. ! విదేశాల్లో చదివించే స్థోమత ఉన్నా.. వాళ్లు కట్టించిన కాలేజీలో అశోక్ కూతురు చదివింది.. బెంజిలో వెళ్లే రేంజ్ ఉన్నా కాలేజీ బస్ లో వెళ్లింది. సీటు బెల్ట్ పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ నానో కారులో వెళ్లే వ్యక్తి అతను..
మీ నాయకుడి అన్న.. కాళ్లు పట్టుకుని పార్టీని పులిహోర చేశాడు..
వాళ్ల అన్న ఎన్టీఆర్ నే Don’t care అన్నాడు.

వాళ్లకీ మీకు పోలికేంటి అసలు..?
ఏం పనవ్ కల్యాణ్ ఏమన్నా దేవుడా..? ఆయన అందరికీ తెలియడానికి…? తెలియదు అంటే మీరు నోటికొ్చ్చింది మాట్లాడతారా..?

నిజాయితీ గల నేతలను చాలా మందిని చూసుంటారు..
కానీ నిజాయితీతో పాటు.. బంధుప్రీతి.. కులభిమానం..పక్షపాతం.. మొహమాటం లేని నిెఖార్సైన నేత అతనొక్కడే..!

నోరు ఉంది కదా అని అందరినీ ప్రశ్నించే పీకే.. ఏనాడైనా సమాధానాలు చెప్పాడా..?

ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్య, చంద్రబాబు ఎన్నికల సభల్లో చెప్పి.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదో జనాలకు సమాధానం చెప్పాలా..? వాళ్లు చాలా సార్లు సమాధానం చెప్పారు కానీ.. ముందు ఆయన్ను సమాధానం చెప్పమనండి..

ఎన్నికల్లో సామాజిక తెలంగాణ అని చెప్పిన ఆయన అన్న పార్టీ.. ఆ తర్వాత ఎందుకు సమైక్యాంధ్ర అందో యువరాజ్యం అధ్యక్షుడిగా నువ్వ సమాధానం చెప్పావా..?

ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మీకు 70లక్షలు మంది ఓటు వేశారో..అదే కాంగ్రెస్ లో ఎందుకు కలిపారని.. నువ్వూ…మీ అన్నయ్య ఆ 70లక్షల మందికి సమాధానం చెప్పారా..?

మీ పార్టీకి పార్లమెంట్ లో కూర్చునే అర్హత లేదని.. ఒక్క.సీటు కూడా మీకు ఇవ్వలేదు. మీ బావ అల్లు అరవిందే ఓడిపోయాడు.

సొంతూరులో మీ అన్ననే గెలిపించుకోలేకపోయాడు..నువ్వు అశోక్ ను గెలిపించడమేంటి..? లేకపోతే.‍. ఇది అత్తాపూర్ బాబా కామెడీనా..?

మూడేళ్లుగా జనసేనను నిర్జనసేనగా మార్చిన తీరు నీ చేతకానికనాన్ని…ఉత్తర దక్షిణ భారతగొడవలంటూ చేస్తున్న గొడవ నీ తెంపరితనాన్ని… ప్రత్యేకహోదాపై గొడవ.. నీ అఙ్ఞానాన్నీ.. ఐఏఎస్ లపై వ్యాఖ్యలు ఈ అవగాహనారాహిత్యాన్నీ .. తెలుపుతున్నాయ్..

ముందు వీటికి సమాధానం చెప్పండి.

చాన్నాళ్లుగా రాష్ట్రం అంతా చూస్తున్నారు.. ఒకటే పూనకం… ఆయన నోరు తెరిస్తే పూనకం..ఆవులిస్తే పూనకం.. జుట్టు చెరుపుకున్నా పూనకం…చివరకు నా దగ్గర డబ్బుల్లేవన్నా.. లేకపోతే..ఏదో నాకు రాదన్నా కూడా…అరుపులే.. దేనికి ఎలా స్పందించాలో కూడా వెర్రి ఆవేశం.. నిజంగా ఏమీ లేకపోయినా మళ్లీ దానికి పననిజం అని ఓ పేరు..! మీ కంటే అవగాహన లేదు.. మిమ్మల్ని కట్టడి చేయకుండా ప్రోత్సహిస్తున్న మీ నాయకుడికి కూడా అవగాహన లేదనే అనిపిస్తోంది….

Your Comments / Feedback