English Version
  26 Sep, 2017
Home / All in one / పదేళ్లు..ఏడు ఊచలు!

పదేళ్లు..ఏడు ఊచలు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం:
అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా బాబా గుర్మీత్‌ రామ్ రహీం సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు పదేళ్లు జైలుశిక్ష విధిస్తూ సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. రోహ్‌తక్‌లోని సునరియా జిల్లా జైలులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోర్టులో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయవాది జగ్దీప్ సింగ్ ఈ సంచలన తీర్పు వెలువరించారు. ప్రొసీడింగ్స్ సందర్భంగా గుర్మీత్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని సీబీఐ వాదించింది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా గుర్మీత్‌కు శిక్ష తగ్గించాలని ఆయన తరఫు లాయర్ వాదించారు. పది నిమిషాలపాటు ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. గుర్మీత్ సైతం తీర్పును తలుచుకుని కంటతడి పెట్టారు. తాను సోషల్ వర్కర్‌నని, తన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు ముకుళిత హస్తాలతో విన్నవించుకున్నారు. ఈనెల 25న గుర్మీత్‌ను దోషిగా నిర్దారిస్తూ పంచకులలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. అయితే జైలుశిక్ష ఎన్నేళ్లనేది ప్రకటించకుండా వాయిదా వేసింది. సోమవారం ప్రత్యేక కోర్టు జైలుశిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరక్కుండా ముందస్తు జాగ్రత్తగా సునరియా జైలు వెలుపల మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. డేరా బాబా అనుచరులు జైలు వద్ద గుమిగూడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించి కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

Your Comments / Feedback