English Version
  11 Oct, 2017
Home / Latest News / నేరెళ్ల డ్యామేజీ రిపేరా..?

నేరెళ్ల డ్యామేజీ రిపేరా..?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది గడచిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు మొదలు పెట్టారు. అదీ ఆయన సొంత జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మేనల్లుడు హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న సిద్ధిపేట, కుమారుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సిరిసిల్ల జిల్లాలలో ఈ భవనాలకు కేసీఆర్ శిలాఫలకాలు వేశారు. పనిలో పనిగా ఇద్దరు నేతలను పొగడ్తలతో ముంచెత్తారు. ఇటీవల నేరెళ్ల ఘటనతో సిరిసిల్లలో కేటీఆర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. సీఎం తన పర్యటనతో ఆ డ్యామేజ్ ను కొంత మేర రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ కు సిరిసిల్ల నీళ్లు పడ్డాయని ఛలోక్తి విసిరారు. ముందు జిల్లా ఇస్తే చాలన్నాడని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు అని వెంటపడుతున్నాడని కేటీఆర్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేశారు కేసీఆర్.

Your Comments / Feedback