English Version
  8 Oct, 2017
Home / All in one / నేను గౌరవ అమాత్యుడినే!

నేను గౌరవ అమాత్యుడినే!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : చాలా కాలం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నోరు విప్పారు. సీఎం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం పై వివరణ ఇచ్చారు. అది తప్పుడు ప్రచారమన్నారు. మంత్రుల పై ఒత్తిడి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఉద్యోగుల బదిలీల వ్యవహారం సీఎం చూస్తున్నారని చెప్పుకొచ్చారు. హంద్రీనీవా నీటి వాటాలో కర్నూలుకు అన్యాయం జరగబోదని, కాల్వకు గండికొడతామని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. ఈ విషయం అలా ఉంచితే…దాదాపు ఏడాదిన్నర నుంచి ప్రభుత్వంలో కేఈకి ప్రాధాన్యత ఉండటం లేదన్న ప్రచారం ఉంది. రెవెన్యూ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో తీవ్ర విమర్శలు చెలరేగడంతో అప్పట్లో చేసిన బదిలీలను సైతం సీఎం రద్దు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ బదిలీలన్నీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. రాజధాని భూ సమీకరణ వ్యవహారంలో సైతం సీఎం తనను పరిగణనలోకి తీసుకోకపోవడం పై కేఈ మనస్థాపంతో ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత కేఈ రాజకీయంగా కానీ, పాలనాపరంగా కానీ ఎక్కడా ఫోకస్ లో లేరు. నంద్యాల ఎన్నికల సమయంలో సైతం ఆయన పెద్దగా కనిపించలేదు. తాజాగా తెర మీదకు వచ్చి తనకు సీఎం వద్ద ప్రాధాన్యత ఉందని చెప్పుకోవడం గమనార్హం.

Your Comments / Feedback