English Version
  24 Sep, 2017
Home / Politics / నల్లగొండ బై పోల్ బరిలో రేవంత్!

నల్లగొండ బై పోల్ బరిలో రేవంత్!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: బిగ్ బ్రేకింగ్! అనూహ్య ప్రతిపాదన!! తెలంగాణ తెలుగుదేశంలో సంచలన పరిణామాలకు తెర లేచింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఒక వార్త ఇప్పుడు నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. నల్లగొండ ఉప ఎన్నిక బరిలో టీడీపీ తరపున రేవంత్ రెడ్డి రంగంలో దిగే దిశగా పార్టీలో సమాలోచనలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా నాయకుల నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. నల్లగొండ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు మూకుమ్మడిగా ఈ అభిప్రాయానికి వచ్చారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఈ లోక్ సభను ఉప ఎన్నిక వస్తే అంత తేలిగ్గా వదులుకోకూడదన్న యోచనలో నేతలు ఉన్నారు. ఈ ప్రతిపాదన పై కాంగ్రెస్ తో సహా స్థానికంగా ఇతర విపక్ష పార్టీల నేతల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. రేవంత్ అభ్యర్థి అయితే ఎలక్షన్ హీట్ ఓ రేంజ్ కు వెళ్లిపోతుందని, కేసీఆర్ కు ధీటుగా సమాధానం చెప్పడానికి తాము కూడా సహకరిస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. రేవంత్ బరిలోకి వస్తే సీన్ మొత్తం కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా నడుస్తుందని సదరు నేతలు విశ్లేషించినట్టు సమాచారం. నియోజకవర్గ సామాజిక కోణంలో సైతం రేవంత్ అయితే “సరైనోడు” అవుతాడని జిల్లా టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. రెడ్డి ప్రాబల్యం బలంగా ఉండటమే కాక బోర్డర్ ఏరియాలో సెటిలర్స్ ఓటు గుండుగుత్తిగా టీడీపీ ఖాతాలో పడటం ఖాయం అంటున్నారు. పార్టీ పరంగా బీసీలు ఎలాగు ర్యాలీ అవుతారు. రెడ్లకు పెట్టని కోటలాంటి నల్లగొండలో టీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా ఆ సామాజికవర్గం అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి అయితే బీసీ లేదా వెలమను బరిలోకి దింపాలనుకుంటున్నారు. మరీ ఇబ్బంది అవుతుందనుకుంటే మాత్రం….రెడ్డిని రెడ్డితోనే కొట్టాలనే వ్యూహంతో టీఆర్ఎస్ నుంచి కూడా రెడ్డి అభ్యర్థినే ఎంపిక చేయవచ్చునంటున్నారు. కేసీఆర్ ఎవరిని నిలిపినా టీడీపీ నుంచి రేవంత్ రంగంలో ఉంటే అయితే గెలుపు లేదా టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టే పరిస్థితి వస్తుందన్నది విశ్లేషకుల భావన. తెలంగాణ మొత్తం ఈ ప్రభావం ఉంటుంది కనుక పార్టీకి ఎక్కడలేని బూస్టప్ వస్తుందని చెబుతున్నారు. రేవంత్ బరిలోకి దిగితే ఈ ఒక్క ఎన్నికతో కాంగ్రెస్ ను పూర్తిగా వెనక్కునెట్టి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీ ముందు వరుసలోకి వచ్చేస్తుందని…ఆ ప్రభావం సాధారణ ఎన్నికల వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉత్తమ్ పై మంట మీద ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం రేవంత్ కు సహకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. రేవంత్ అంటే బీజేపీ కూడా తన వంతు సహకారం ఇస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా జిల్లా నేతల ప్రతిపాదన ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే మాత్రం నల్లగొండ బై పోల్ హిస్టరీలో నిలిచిపోవడం ఖాయం.

Your Comments / Feedback