English Version
  29 Sep, 2017
Home / Latest News / నల్గొండ బై పోల్ పై కేసీఆర్ ఏమన్నారంటే…!

నల్గొండ బై పోల్ పై కేసీఆర్ ఏమన్నారంటే…!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : నల్గొండ ఉప ఎన్నిక పై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పారు. కానీ, ఏమీ చెప్పలేదు. దీంతో మరికొన్ని రోజులు సస్పెన్ష్ కొనసాగుతుందన్న విషయం స్పష్టమైంది. అదే సమయంలో ఉప ఎన్నిక ఆలోచనను సీఎం కొట్టిపారేయలేదు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ‘నల్గొండ ఉప ఎన్నిక వస్తుందో రాదో నాకూ తెలియదని…వస్తే మాత్రం టీఆర్ఎస్ ఖాయంగా గెలుస్తుంది’ అని సీఎం స్పష్టం చేశారు. సీఎం స్పందన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

సీఎం మదిలో ఉప ఎన్నిక ఆలోచన ఉందన్నది తేలిపోయింది. అయితే…ఈ ప్రతిపాదన ఇంకా ఆలోచన దశలోనే ఉండొచ్చని, ఆ విషయం తేలకపోవడం వల్లే సీఎం పై విధంగా స్పందించి ఉంటారన్నది ఒక వాదన. కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారని, వ్యూహాత్మకంగానే ఆ విషయాన్ని చెప్పీ చెప్పనట్టుగా చెప్పారన్నది మరో వాదన. నల్గొండ ఉప ఎన్నికలో అవసరానికి అనుగుణంగా టీఆర్ఎస్ సర్కారు ఆ లోక్ సభ పరిథిలో చర్యలు ప్రారంభించింది. స్థానిక అభివృద్దికి భారీగా నిధులు ఇవ్వబోతున్నారని సమాచారం. నియోజకవర్గ పరిదిలో పోలీసు మొదలు పలు శాఖల అధికారుల బదిలీలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ పూర్తి కాకుండానే సీఎం ఉప ఎన్నిక విషయం ప్రకటిస్తే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. పైగా విపక్షాలు వాటి స్థాయిలో అవి వేగం పెంచే అవకాశాలుంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సీఎం అవుననక…కాదనక అన్నట్టుగా స్పందించారని తెలుస్తోంది.

Your Comments / Feedback