English Version
  26 Sep, 2017
Home / All in one / దారిదొరకని స్కైవేలు!!

దారిదొరకని స్కైవేలు!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం :హైదరాబాదులో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అటకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు అధోగతి పాలైంది. ఆ తర్వాత వరుసలో మెట్రో ప్రాజెక్టు సందిగ్ధంలో ఉంది. లాభదాయకం కాదన్న సందేహంతో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టు పనులను నత్తనడకన చేస్తోన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదో కోవలోకి మరో ప్రాజెక్టు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ 550 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదించిన స్కైవేల ప్రాజెక్టు ఇప్పుడు డోలాయమానంలో పడినట్టు తెలిసింది. ఏడాదిన్నర క్రితం ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఇప్పుడు తనను ఒప్పందం నుంచి తప్పించాల్సిందిగా కోరుతూ జీహెచ్ఎంసీకి లేఖ రాసినట్టు సమాచారం…ఇంతకూ ఏం జరిగింది…? కాంట్రాక్టు సంస్థ ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటోంది…? స్కైవేస్ ప్రాజెక్టు ఇప్పటికే కేసులు, విచారణ.. కేంద్ర ప్రభుత్వ నుంచి క్లియరెన్స్‌ వంటి వాటితో జాప్యం జరుగుతోంది. జాప్యం కారణంగా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలు ఉంచుకొని నిర్మా ణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సంస్థ సర్కారుకు పంపింది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఉ న్న ఆరు చౌరస్తాల్లో బహుళ వంతెనల మార్గాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ ప్రవేశ ద్వారం, రోడ్‌ నెంబర్‌ 45, ఫిల్మ్‌న గర్‌, మహారాజ్‌ అగ్రసేన్‌, బసవ తారకం క్యాన్సర్‌ ఆస్ప త్రి చౌరస్తాల్లో రూ.560 కోట్లతో ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు యేడాదిన్నర క్రితం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. తక్కువ కోట్‌ చేసిన ఎంవీఆర్‌ సంస్థను ఎంపిక చేసిన అధికారులు నిర్మాణ పనులకు సం బంధించి యేడాదిన్నర క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ టవర్స్‌ నిర్మాణ ప్రతిపాదనల నేపథ్యంలో క్యాన్సర్‌ ఆస్పత్రి, మహారాజ అగ్రసేన్‌ చౌరస్తాల వద్ద పనులను తాత్కాలికంగా వాయిదా వేశారు. రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలన్నది ఒప్పందం. యేడాదిన్నర గడిచినా ఇప్పటికీ.. స్థలం అప్పగించలేదు. జాతీయ వనంగా గుర్తింపు ఉన్న పార్కు చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణం సంక్లిష్టంగా మారింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర అటవీశాఖ ఫైల్‌ను కేంద్రానికి పంపింది. ని బంధనల ప్రకారం ప్రతిపాదనలపై కేంద్ర పర్యావరణ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకటించి.. అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తుంది. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూ ర్తవడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు చెబుతు న్నారు. అప్పటికే కాంట్రాక్టు గడువు ముగుస్తుంది.
రద్దు చేయాలని ఎంవీఆర్‌ లేఖ
టెండర్‌లో బిడ్‌ దాఖలు చేసిన సంస్థల ఎంపికలో గతంలో చేసిన ప్రాజెక్టులు, పనితీరును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా.. ఎప్పుడు అగ్రిమెంట్‌ జరిగింది..? ఎప్పటిలోపు పనులు పూర్తయ్యాయి..? అన్నది పరిశీలిస్తారు. రెండేళ్ల గడువులో యేడాదిన్నర గడిచినా ఇప్పటికీ సైట్‌ అప్పగించని దృష్ట్యా.. పనుల ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. స్థలమైనా అప్పగించండి.. అగ్రిమెంట్‌ అయినా రద్దు చేయండి అని నిర్మాణ సంస్థ ఇటీవల జీహెచ్‌ఎంసీకి లేఖ ఇచ్చినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ లేఖను జతపరుస్తూ.. కేబీఆర్‌ పార్కు చుట్టూ చేపట్టనున్న పనుల కోసం ఎంవీఆర్‌తో కు దుర్చుకున్న ఒప్పందం రద్దు చేయాలా..? ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించాలని కోరుతూ… జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు పంపింది.
వారంలో పీసీసీఎఫ్‌ అనుమతి వస్తే..?
కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ అనుమతికి మరో ఆరు నెలలు పట్టే అవకాశమున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇస్తే క్షేత్రస్థాయిలో ఎలాం టి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) అనుమతి ఇచ్చినా పనులు చేసే అవకాశముంటుంది. పీసీసీఎఫ్‌ నిర్ణయం నాలుగైదు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వచ్చే వారంలో నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. జాప్యమవుత దు నుకుంటే ఒప్పందం రద్దు చేసి.. కేంద్రం క్లియరెన్స్‌ ఇ స్తే మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Your Comments / Feedback