English Version
  26 Sep, 2017
Home / Politics / దానివల్ల కేటీఆర్ గ్రాఫ్ పడిపోయిందా!?

దానివల్ల కేటీఆర్ గ్రాఫ్ పడిపోయిందా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: టీఆర్ఎస్ లో కేటీఆర్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. రోజు రోజుకు తమ యువనేతకు పెరుగుతోన్న ఇమేజ్ వాళ్లలో బీపీ పెంచుతోంది. ఆయనకు వస్తోన్న అవార్డులు-రివార్డులు తమ కొంప కొల్లేరు చేసేలా ఉన్నాయని వాళ్లు వాపోతున్నారు. అసలే తమ యువనేత పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఇటీవల ఆయనను వరించిన ఐటీ మేటి మంత్రి అవార్డు కేటీఆర్ గ్రాఫ్ ను మరింత పెంచిందన్నది వాళ్ల ఆవేదన. అవార్డు వస్తే, గ్రాఫ్ పెరిగితే మంచిదేగా…ఇందులో బాధపడాల్సిందేముంటుందనేగా ప్రశ్న. ఇక విషయంలోకి వెళదాం… కేటీఆర్ లైఫ్ స్టైల్ డిఫరెంట్. ఆయనదంతా హైఫై సొసైటీ ఫ్రెండ్ సర్కిల్. గ్లామర్ ఫీల్డ్ తో చెట్టాపట్టాలేసుకు తిరగడం డెయిలీ కనిపించే దృశ్యమే.

అయితే…పార్టీ ఫ్యూచర్ లీడర్ గా ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ తమ నేతను దెబ్బతీస్తుందన్నది మొదటి నుంచి ఆయన అభిమానుల వాదన. గట్టి ఓటు బ్యాంకు అనుకునే గ్రామీణులు, మట్టి మనుషులు, రైతులు లాంటి సెక్షన్ తో కేటీఆర్ మమేకం కావడం చాలా తక్కువ. ఐటీ, ఇండస్ట్రియలిస్టులు, సినీ తారలు, స్పోర్ట్స్ పర్సన్స్ లాంటి పేజ్ త్రీ సొసైటీలో కేటీఆర్ బాగా మింగిల్ అవుతారు. మీడియాలో సైతం కేటీఆర్ ఎక్కువగా ఈ యాంగిల్ లోనే కనిపిస్తారు. సో సీన్ అంతా ఆయనకు వెరీ క్లాస్ లీడర్ అన్న ముద్ర వేసింది. కానీ, టీఆర్ఎస్ లాంటి పార్టీని భవిష్యత్ లో నడపాలంటే పక్కా మాస్ లీడర్ అయితే తప్ప సాధ్యం కాదన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. అసలే కేటీఆర్ హైఫై ఐటీ అనుకుంటుంటే…ఈ మధ్య వచ్చిన ఐటీ అవార్డు ఆయన క్లాస్ ఇమేజ్ ను మరింత పెంచిందట. మాస్ లీడర్ గా మారడం సంగతి అటుంచి తమ భవిష్యత్ ఆశాకిరణం రాను రాను ఇలా క్లాస్ చట్రంలో ఇరుక్కుపోతే ఎలా అని గులాబీ గుంపు గుసగుసలాడుకుంటోంది!

Your Comments / Feedback