English Version
  6 Oct, 2017
Home / Latest News / తెలంగాణ తెచ్చింది వెలమోడే!! నేను చేసిన లక్షల మంది కార్యకర్తల్లో కోదండ ఒకడు! కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్

తెలంగాణ తెచ్చింది వెలమోడే!! నేను చేసిన లక్షల మంది కార్యకర్తల్లో కోదండ ఒకడు! కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ప్రతిపక్ష నేతలు తనను దొరగా అభివర్ణిస్తూ విమర్శించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా అభ్యంతర పెట్టారు. వాస్తవానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే అసలైన దొర అని చెప్పుకొచ్చారు. ఉత్తమ్ స్వగ్రామంలో ఆయన తండ్రి నిర్మించిన భవనం గడీ అని కేసీఆర్ గుర్తు చేశారు. అయినా, రాజకీయ నాయకులకు కులం అంటగట్టడం ఏమిటని ప్రశ్నించారు. అభిరుచి ఉంటే రాజకీయాలలో ఏ కులం వారైనా రాణించవచ్చునన్నారు. 0.5 శాతం ఉన్న కులం వాళ్లు పాలన చేస్తున్నారని అంటున్నారు….తెలంగాణ తెచ్చింది ఆ 0.5 శాతం కులపోడు కాదా? అని ప్రశ్నించారు కేసీఆర్. ఇక కోదండ రాం పై కేసీఆర్ ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. కోదండ ఏనాడైనా సర్పంచ్ గానైనా గెలిచాడా? ఆయనకు ఉన్న బాధ్యత ఏమిటని ప్రశ్నించారు. కోదండ రాం మొదటి నుంచి కాంగ్రెస్ మనిషేనన్నారు. తెలంగాణ రాగానే సోనియా, దిగ్విజయ్ లను రహస్యంగా కలిశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. అయినా…కోదండ రాం కన్వీనర్ గా జేఏసీ ఏర్పాటు చేసిందే తానని, దాని విధివిధానాలు కూడా తానే రూపొందించానని చెప్పారు. తాను తయారు చేసిన లక్షల మంది కార్యకర్తల్లో కోదండ ఒకరన్నారు. టీడీపీతో పొత్తు గురించి ప్రస్తావించగా…లేని పార్టీ గురించి మాట్లాడేదేముంది అని తేలిగ్గా తీసి పారేశారు. పరిటాల రవి తనకు మిత్రుడని, ఆయన చనిపోయిన సమయంలో ఉద్యమంలో ఉండి వెళ్లలేకపోయానన్నారు. స్నేహితుడి కుమారుడు పెళ్లికి వెళ్లి వస్తే కూడా విమర్శలేనా అని దుయ్యబట్టారు.
కొసమెరుపు
0.5 శాతం కులపోడే తెలంగాణ తెచ్చాడన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణను కేసీఆర్ ఒక్కడే తెచ్చి ఉంటే ప్రాణ త్యాగం చేసిన 1200 మంది అమరుల పాత్ర లేదా అన్నది ప్రశ్న.

Your Comments / Feedback