English Version
  26 Sep, 2017
Home / Black & White / తెలంగాణలో కొత్త సిద్ధాంతం!

తెలంగాణలో కొత్త సిద్ధాంతం!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ఒకనాడు తెలుగుజాతి ఆత్మగౌరవం. అది ఎన్టీఆర్ ప్రవచించిన సిద్ధాంతం. అది సూపర్ హిట్. నిన్న తెలంగాణ వాదం. వాస్తవానికి ఇది 1969 లోనే పురుడు పోసుకున్న పోరువాదం. ఆ తర్వాత 2001లో కేసీఆర్ అందిపుచ్చుకున్న రాజకీయ సిద్ధాంతం. ఇది కూడా సూపర్ హిట్. మరి ఇప్పుడు? తెలంగాణలో కొత్త రాజకీయ సిద్ధాంతం ఏమిటి? దానికి రూపకర్త ఎవరు? ఏ ఎజెండా రేపటి తెలంగాణలో ఆవిష్కృతం కాబోతోంది? వాస్తవానికి ఈ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. కానీ, టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేవనెత్తుతోన్న ఒక కొత్త వాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయ అవని పై సరికొత్త చర్చకు తెర లేపింది. ఇదే రేపటి తెలంగాణ సిద్ధాంతంగా రూపాంతరం చెందుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ రేవంత్ ప్రవచిస్తోన్న ఆ సిద్ధాంతం ఏమిటీ? “కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ” ఇదే రేవంత్ చెబుతోన్న కొత్త సిద్ధాంతం. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఈ సిద్ధాంతమే తెలంగాణలో క్రమంగా తెర మీదకు వస్తోంది. కుళ్లిన వ్యవస్థలను ప్రశ్నిస్తూ… దుర్భర పరిస్థితులను నిలదీస్తూ….కొన్ని జాతులు, వర్గాలకు జరుగుతోన్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ సిద్ధాంతాలు పుట్టుకు వస్తుంటాయి. కానీ, కేవలం కేసీఆర్ అనే ఒక నాయకుడుకి వ్యతిరేకంగా సిద్ధాంతాన్ని రచించడం ఏమిటన్న ప్రశ్న. దీన్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే….రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో జరుగుతున్నది ఏమిటి అన్న ప్రశ్నే ఈ పునరేకీకరణ సిద్ధాంతానికి పునాదిగా కనిపిస్తోంది. తెలంగాణ అస్థిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించే నైజాన్ని కేసీఆర్ రీ డిజైన్ చేస్తూ…తన మార్కు ముద్రను తెలంగాణ పై రుద్దాలనుకుంటున్నారు. ఉద్యమ సమయంలో ఆయన కాకరకాయ అన్న అంశాల పై ఇప్పుడు కీకరకాయ అంటున్నారు. నాటి ఆంధ్రా కాంట్రాక్టర్లే నేడు ప్రగతి భవన్ లో చక్రం తిప్పుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల గుంపుగా టీఆర్ఎస్ రూపాంతరం చెందిందన్నది ఈ వర్గం వాదన. కాంట్రాక్టర్ల నుంచి సినిమాల వరకు…స్వామీజీల నుంచి స్వాహాకారుల వరకు టీఆర్ఎస్ లో సర్వం ఇప్పుడు వారిదే హవా. అలాంటి శక్తులకు మూలస్థంబంగా మారినందునే “కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ” అన్నది తెర మీదకు వచ్చింది. అయితే…ఈ పునరేకీకరణ పూర్తి రూపం ఎలా ఉంటుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నే!!

Your Comments / Feedback