English Version
  26 Sep, 2017
Home / Politics / తెలంగాణకు లాలూ వస్తే!!

తెలంగాణకు లాలూ వస్తే!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో త్వరలో బీసీ గర్జన పేరుతో ఓ భారీ బహిరంగ సభ పెట్టి, దానికి లాలూను ముఖ్య అతిథిగా పిలవాలనే యోచనలో టీ కాంగ్రెస్ ఉంది. దీనికి సూత్రధారిగా సీనియర్ కాంగ్రెస్ నేత వి హన్మంతరావు వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం హన్మంతరావు లాలూను కలిశారు. ఎన్డీయేకి వ్యతిరేకంగా బీహార్లో యూపీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో లాలూదే ప్రధాన పాత్ర. ఇటీవల లాలూకు పొలిటికల్ విడాకులిచ్చి బీహార్ సీఎం నితీష్ కుమార్ మోదీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ ఈ ర్యాలీ తలపెట్టారు. ర్యాలీ విజయవంతం అయిన సందర్భంగా లాలూను కలిసి వీహెచ్ అభినందనలు తెలిపారు. త్వరలో తెలంగాణలో బీసీ గర్జన పెడతామని, ముఖ్య అతిథిగా రావాలని వీహెచ్ ఆహ్వానించినట్టుగా తెలిసింది. తెలంగాణలో యాదవ సామాజికవర్గ ఓట్లు ఆకర్షించడానికి లాలూ పర్యటన ఉపయోగపడుతుందన్నది వీహెచ్ వాదన. మరి వీహెచ్ ఆలోచనకు టీ కాంగ్రెస్ కార్యరూపం ఇస్తుందా! చూడాలి!!

Your Comments / Feedback