English Version
  10 Oct, 2017
Home / Latest News / “టెంపుల్” లో ఏం జరిగింది!?

“టెంపుల్” లో ఏం జరిగింది!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : అమిత్ షా కుమారుడు జై షా డైరెక్టర్ గా ఉన్న టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. ఆ కంపెనీ టర్నోవర్ ఒక్క ఏడాదిలోనే రూ.50 వేల నుంచి రూ.80 కోట్లకు పెరగడం వెనుక కుంభకోణం ఉందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. నోట్ల రద్దుకు నెల రోజుల ముందు కంపెనీని మూసేసి, నోట్లు మార్చుకున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా దేశం లో విపక్ష నేతలందరిపైనా కేసులు పెట్టి, సీబీఐ – ఈడీలను ప్రయోగిస్తోన్న ప్రధాని మోడీ దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు. షా రాజీనామా చేయాలని, కంపెనీ కార్యకలాపాల పై న్యాయవిచార జరిపించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీ కాంగ్రెస్ ధర్నా చేసింది. అక్కడ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Your Comments / Feedback