English Version
  26 Sep, 2017
Home / All in one / జెమిని న్యూస్ మూసివేత!

జెమిని న్యూస్ మూసివేత!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: తమిళనాడు కేంద్రంగా నడుస్తోన్న జెమిని న్యూస్ త్వరలో మూతబడబోతోంది. దీనితో పాటు సన్ గ్రూప్ లోని ఉదయ న్యూస్, సన్ న్యూస్ ను కూడా మూసివేయబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 24 చివరి పనిదినమని చెబుతున్నారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో లేబర్ కమిషనర్లకు సంస్థ యాజమాన్యం సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. తొలి తరం ఎలక్ట్రానిక్ మీడియాగా సుమారు ఇరవై ఏళ్ల క్రితం నుంచి సన్ నెట్ వర్క్ పని చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో టాప్ ఛానెల్ గా చలామణిలో ఉన్న టీవీ9 వ్యవస్థాపకుల్లో ఒకరైన రవి ప్రకాష్ గతంలో సన్ గ్రూప్ లో పని చేశారు. సంస్థ మూసివేతతో కొన్ని వేల మంది రోడ్డున పడబోతున్నారు. ప్రస్తుతం సన్ గ్రూప్ లాభాలలో ఉన్నట్టు చెబుతున్నారు. సన్ డైరెక్ట్ పేరుతో డిష్, సన్ నెక్ట్స్ పేరుతో ఇటీవల రూపొందించిన యాప్ బాగా పాపులర్ అయింది. అయినా, న్యూస్ విభాగాలను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

Your Comments / Feedback