English Version
  26 Sep, 2017
Home / Politics / జెండా ఎగరేసిన రేవంత్ !

జెండా ఎగరేసిన రేవంత్ !

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: తెలంగాణ పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ డేరా బాబాలా తయారయ్యాడని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని ఆర్భాటపు మాటలు చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ఆ తర్వాత నగరాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారన్నారు. నగరంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. స్కైవేలు, హైవేలు, హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు, వంద అంతస్థుల భవనాలు, న్యూయార్క్, లండన్ లు అంటు ఆర్భాటపు మాటలే తప్ప కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఇలా చప్రాసీ నుంచి సీఎం వరకు అందరూ టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారని, ఇక అభివృద్ధి చేయడానికి వచ్చిన ఇబ్బందేమిటని రేవంత్ ప్రశ్నించారు. మంత్రి మహేందర్ రెడ్డి హిమాయత్ సాగర్ లో కబ్జాపెట్టి, గెస్ట్ హౌస్ కట్టుకుంటే చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. కూకట్ పల్లిలో నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ జెండా దిమ్మెను ద్వంసం చేసిన విషయం తెలుసుకున్న రేవంత్ ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో పర్యటించారు. జెండా దిమ్మెను పునరుద్ధరించి…పసుపు జెండా ఎగురవేశారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు పైనా రేవంత్ నిప్పులు చెరిగారు. త్వరలోనే తెలంగాణలో టీఆర్ఎస్ దిమ్మెలు కూలడం ఖాయమన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే టీఆర్ఎస్ భవన్ ఇటుకలు ఊడబీకుతామని హెచ్చరించారు. రేవంత్ రాక సందర్భంగా కూకట్ పల్లిలో పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

Your Comments / Feedback