English Version
  26 Sep, 2017
Home / Politics / జానా మళ్లీ వేసేశాడు!!

జానా మళ్లీ వేసేశాడు!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ఎవడు కొడితే ప్రతిపక్షం మైండ్ బ్లాంక్ అవుతుందో ఆయనే జానారెడ్డి! ఈ ప్రధాన ప్రతిపక్ష నేత మరోసారి సొంత పార్టీ మైండ్ బ్లాంక్ చేశారు. అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాం వీడ్కోలు సభలో జానా కామెంట్స్ సొంత పార్టీ వారికి చిరాకు పుట్టించాయి. ఈ సభలో సదారాం, అసెంబ్లీ జరుగుతోన్న తీరు పై అవసరానికి మించి జానా పొగడ్తలతో ముంచెత్తడం తమ కొంప ముంచినట్టుగా ఉన్నాయని కాంగ్రెస్ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. అసెంబ్లీ జరిగే సమయంలో విపక్షాలను సస్పెండ్ చేసి సభ జరుపుకుంటోన్న సందర్భాలున్నాయి. ఆ సమయంలో జానారెడ్డి కూడా పలు సందర్భాలలో ఇది ఏకపక్షం అని ఆక్రోశించారు. తీరా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోన్న తీరు దేశానికే ఆదర్శం అని జానా చెప్పడం కాంగ్రెస్ నేతలను కంగుతినిపించింది. గ్రేటర్ ఎన్నికల వేళ అయిదు రూపాయల భోజనం అదుర్స్ అంటూ జానా ఇచ్చిన కాంప్లిమెంట్ అధికార పక్షానికి బూస్ట్ లా పని చేసింది. అదే సమయంలో విపక్షం నీరసపడేలా చేసింది. పెద్దలు జానారెడ్డి గారు అంటూ అసెంబ్లీలో కేసీఆర్ సంభోదించగానే పెనం పై నీళ్లు జల్లినట్టుగా ఆయన మెత్తబడిపోతారని కాంగ్రెస్ ఎల్పీలో అసంతృప్తి టాక్. ఈ మధ్యనే జానా కాస్త గట్టిగా మారుతున్నారన్న భావన వస్తోంది. ఆయన పీసీసీ అయి 2019 కి పార్టీని లీడ్ చేస్తారని అనుకుంటోన్న సమయంలో లేటెస్ట్ కామెంట్స్ ఆయన వర్గీయులను తలలు పట్టుకునేలా చేసింది…
*కొసమెరుపు*
గడచిన మూడున్నరేళ్లలో ఏపీ, తెలంగాణలలో ప్రజాప్రాతినిధ్య చట్టం అటకెక్కి అట్టపెట్టెలో మూలుగుతోంది. పార్టీలు ఫిరాయిస్తోన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా దర్జాగా కండువాలు మార్చుకొని కూర్చుంటున్నారు. తెలంగాణ లో అలా ఫిరాయించిన వారిలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. వారంతా అధికార టీఆర్ఎస్ పక్షంలో చేరిపోయారు. అది మరచిన జానారెడ్డి అధికారపక్షం సభను దేశానికే ఆదర్శంగా నడుపుతున్నదని, దానికి తాము సహకరిస్తున్నామని చెప్పడమంటే…హే జానా!

Your Comments / Feedback