English Version
  13 Oct, 2017
Home / Latest News / గులాబీ నేతలకు కేటీఆర్ జరిమానా!

గులాబీ నేతలకు కేటీఆర్ జరిమానా!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ఆయన ముఖ్యమంత్రి కుమారుడు. పైగా గులాబీ దళానికి అప్రకటిత వారసుడు. పైగా ఐటీ మంత్రి… దీంతో రాజకీయ ఎదుగుదల కోరుకునే టీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఆయన కంట్లో పడాలనుకుంటారు. యువ నేతను ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు. దీని కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. రాజకీయ పార్టీల్లో, అందులోనూ ప్రాంతీయ పార్టీల్లో ఇది అత్యంత సహజ ప్రక్రియ. అయితే, అలాంటి అత్యుత్సాహం టీఆర్ఎస్ చోటామోటా నేతలకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. అదేంటో మీరే చదవండి….
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో స్వాగతం ఏర్పాట్లు చేశారు. దీనిపై కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. ఆ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అంతటితో సరిపెట్టకుండా అలా ఫ్లెక్సీలు పెట్టిన వారిపై ఫైన్ వేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటును నిషేదిస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ట్విటర్ ఆదేశాలు జారీ చేశారు. మరి మంత్రిగారి సూచన ప్రకారం ఫ్లెక్సీలు పెట్టిన వారి పై మున్సిపల్ కమిషనర్ ఫైన్ వేస్తారా? లేక ఫ్లెక్సీలు తొలగించి, అధికార పార్టీ నేతలతో పంచాయితీ ఎందుకని వదిలేస్తారా. చూడాలి!

Your Comments / Feedback