English Version
  26 Sep, 2017
Home / Politics / ‘గులాబీ’ని నలిపేశారు!!

‘గులాబీ’ని నలిపేశారు!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో మీడియా తన లక్షణాన్ని వదులుకుని అవలక్షణాన్ని అలవాటు చేసుకుంది. ప్రశ్నించే తత్వాన్ని మరచిపోయి విలేకరులు శ్రోతల బృందంగా మారిపోయారు. మీడియా యాజమాన్యాలే ప్లాస్టర్లు వేసుకుంటుంటే నెలజీతంతో బతుకుబండి నెట్టుకొచ్చే మనకెందుకు దురద అన్నట్టు మిన్నకుండిపోయారు. ముఖ్యంగా అధికారపక్ష నేతలను ప్రశ్నించే సాహసానికి నీళ్లొదిలేశారు. ఇది సహజంగా కనిపిస్తోన్న దృశ్యం. అయితే…తాజా టీఆర్ఎస్ఎల్పీలో దీనికి భిన్నమైన దృశ్యం కనిపించింది. గులాబీ నేతలను మీడియా ఓ పట్టుపట్టింది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్యేతర పార్టీలను నిలదీసిన తీరుగా తాజాగా టీఆర్ఎస్ నేతలను మీడియా నిలదీసింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో డిండి ద్వారా నల్గొండ కి నీళ్లు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పు పడుతోంది. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ కు కౌంటర్ ఇచ్చేందుకు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో పాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అసలు విషయం అయిపోయాక…మీడియా ప్రశ్నల సమయం మొదలైంది….అప్పుడేం జరిగిందంటే….
మీడియా: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మీరు జీవోను మార్చారని…మార్చినట్టు తాను నిరూపిస్తానని వంశీచంద్ అంటున్నారు!?
కసిరెడ్డి: మరింత మెరుగ్గా చేయడం కోసం మార్చుతుంటారు. అందులో ఏముంది?
మీడియా: జీవో మార్చారా లేదా?
కసిరెడ్డి: ఆయకట్టు పెంచి నీళ్లు ఇవ్వడం కోసం మార్చారు.
మీడియా: మార్చలేదని మంత్రి జూపల్లి చెబుతున్నారు!?
కసిరెడ్డి: నేను మార్చలేదనే చెబుతున్నా.
మీడియా: ఇప్పుడే మార్చామని చెప్పారుగా!!
కసిరెడ్డి: నేనెప్పుడన్నాను. మార్పులు, చేర్పులు చేస్తుంటామన్నా.
……………………………
చిట్టెం రామ్మోహన్ రెడ్డి: 73 ఓట్లతో గెలిచిన వంశీ నన్ను ప్రశ్నిస్తాడా?
మీడియా: మిమ్మల్ని ప్రశ్నించాలంటే ఎన్ని వేల ఓట్లు రావాలి?
చిట్టెం: వంశీని అడగమనండి చెబుతా.
మీడియా: మేం అడుగుతున్నాం కదా! ఎన్ని వేల ఓట్లుతో గెలిచిన వాడు అడిగితే మీరు సమాధానం చెబుతారు!!?
చిట్టెం: వంశీ మీకేమవుతాడో నాకు తెలియదు.
మీడియా: వంశీ మాకు బంధువుకాదు…చుట్టము కాదు. ఆయననైనా ఇలాగే అడుగుతాం.
చిట్టెం: నేను సీఎం వద్ద నాలుగు గంటలు కూర్చున్నా. అడిగినవన్నీ చేశారు. పెద్దలను ఆదర్శంగా తీసుకుని వంశీ నడుచుకోవాలి.
మీడియా: అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ ఫిరాయించమంటారా?
చిట్టెం: నేను అలా అనడం లేదు.
గువ్వల: రామ్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వేరు. తనను ప్రశ్నించే అనుభవం, వయసు వంశీకి లేదన్నదే ఆయన ఉద్దేశం.
ఇదిగో ఇలా ప్రశ్నోత్తరాలు హాట్ హాట్ గా సాగాయి

Your Comments / Feedback