English Version
  26 Sep, 2017
Home / All in one / గవర్నర్ సడెన్ గా ఎందుకువెళ్లారు!?

గవర్నర్ సడెన్ గా ఎందుకువెళ్లారు!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: గవర్నర్ నర్సింహన్ ఏం చేసినా ఓ మోస్తరు సంచలనమే. సహజంగా గవర్నర్ లు రాజ్ భవన్ కు పరిమితమవుతుంటారు. నర్సింహన్ మాత్రం ఇందుకు భిన్నం. బుధవారం ఆయన సడెన్ గా గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. కాలి వేలుకు చిన్న చికిత్స కోసం ఆయన వెళ్లినట్టు తెలిసింది. ఆసుపత్రి సిబ్బందితో ఆయన కొద్దిసేపు భేటీ అయ్యారు. గవర్నర్ కాలి వేలుకు చికిత్స చేయాలంటే డాక్టర్లే రాజ్ భవన్ కు వస్తారు. కానీ, తనలాంటి వీఐపీ నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళితే ప్రజల్లో వాటి పట్ల నమ్మకం కల్గించడంతో పాటు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండటం, బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంటుందన్న ఉద్ధేశంతో గవర్నర్ నర్సింహన్ ఇలాంటి పర్యటనలు చేస్తుంటారట. ప్రతి పక్షాలు మాత్రం గవర్నర్ పర్యటనను డ్రామాగా అభివర్ణిస్తున్నాయి. కేసీఆర్ పాలనలో ఆసుపత్రులు బాగున్నాయన్న ప్రచారం కోసమే గవర్నర్ ఇలా వెళ్లారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Your Comments / Feedback