English Version
  26 Sep, 2017
Home / Politics / కోమటిరెడ్డిని టచ్ చేస్తే!

కోమటిరెడ్డిని టచ్ చేస్తే!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ పై వేటుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. టీ పీసీసీ చీఫ్ కు కంట్లో నలుసులా తయారైన ఈ బ్రదర్స్ కు పార్టీ నుంచి ఉద్వాసన పలకడమే బెటర్ అన్న అభిప్రాయానికి పీసీసీ వచ్చినట్టుగా సమాచారం. ఆ క్రమంలోనే బ్రదర్స్ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ కాబోతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే నోటీసులు జారీ కావాల్సి ఉంది. అయితే…నోటీసులను మరింత పకడ్బందీగా, వ్యూహాత్మకంగా రూపొందించేందుకు సమయం తీసుకుంటున్నట్టు తెలిసింది. కేవలం కుంతియా పై చేసిన కామెంట్లే కాక గతంలో ఉత్తమ్, జానారెడ్డిల పై చేసిన వ్యాఖ్యలను కూడా నోటీసులో పేర్కొనబోతున్నట్టు సమాచారం. జానా పై వ్యాఖ్యల విషయంలో కూడా వివరణ ఇవ్వాలని కోరడం ద్వారా ఉత్తమ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఇదేదో తన వ్యక్తిగత పంచాయితీ కాదు…కోమటిరెడ్డి పార్టీలోని కీలక నేతలందరిపైనా కామెంట్స్ చేశారన్న భావన కలిగేలా నోటీసులు రూపకల్పన చేస్తున్నారట. శుక్రవారం ఈ నోటీసుల జారీకి రంగం సిద్దమైంది. అదే సమయంలో రాష్ట్రానికి కుంతియా రావడం గమనార్హం. తనకు నోటీసులు ఇవ్వబోతున్నారన్న సమాచారం తెలిసిన కోమటిరెడ్డి తన సన్నిహితుల వద్ద ఘాటుగా స్పందించినట్టు తెలిసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బరిలో నిలిచిన వెంకయ్య నాయుడును కలిసి జానారెడ్డి అభినందించి వచ్చారు…అప్పుడు జానారెడ్డి పై ఎందుకు చర్య తీసుకోలేదన్న ప్రశ్న లేవనెత్తినట్టు తెలిసింది. తనతో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా చేస్తానని తీవ్ర స్వరంతో అన్నట్టు తెలిసింది.

Your Comments / Feedback