English Version
  26 Sep, 2017
Home / All in one / కేసీఆర్ పొలం పెట్టుబడి ఎంత?

కేసీఆర్ పొలం పెట్టుబడి ఎంత?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : తన వ్యవసాయ క్షేత్రంలో ఎకరానికి రూ. కోటి పంట పండుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారు. తన క్షేత్రాన్ని చూపించేందుకు మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లిన ఆయన మొత్తం అంతా కలియతిప్పి…తాను పండిస్తోన్న క్యాప్సికమ్, ఇతర పంటలు చూపించి ఆదాయం సంగతి చెప్పారు. దీనిపై అప్పట్లో మీడియా ప్రతినిధులే కాక రాష్ట్రం మొత్తం నోరెళ్లబెట్టింది. విపక్షాలకైతే ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఎకరా కు రూ.కోటి ఆదాయం అంశం ఓ అస్త్రంగానే ఉంది. ఆదాయం సంగతి సరే పెట్టుబడి సంగతేమిటీ? ఆయన ఎకరాకు ఎంత పెట్టుబడి పెడతారన్నది ఆసక్తికరం. అది ఫాంహౌస్ వ్యవసాయం కనుక పెట్టుబడి కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. అది ఎంతన్న విషయం అటుంచితే…ప్రభుత్వ పెట్టుబడి పథకంలో కేసీఆర్ లబ్ధిదారా…కాదా అన్నది ఇప్పుడు ప్రశ్న. వచ్చే ఏడాది నుంచి, రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ. ఎనిమిది రైతుల ఖాతాలో వేస్తామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కు కూడా మెదక్ జిల్లా, జగదేవ్ పూర్ మండలం, ఎర్రవల్లిలో సుమారు 38 ఎకరాల పొలం ఉంది. ఈ విషయాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. పెట్టుబడి పథకం ప్రకారం లెక్కేస్తే ఆయనకు ఏడాదికి రూ. 3.04 లక్షలు దక్కుతాయి. మరి ఆయన ఈ పథకంలో చేరుతారా? లేక తనది కాస్ట్లీ సాగు, ఎకరాకు రూ. కోటి సంపాదించే వ్యవసాయం కనుక ఆ పథకం నుంచి తనను మినహాయించుకుంటారా…చూడాలి!!

Your Comments / Feedback