English Version
  8 Oct, 2017
Home / Trending / కేసీఆర్ చివరిక్షణంలో మీరెవరంటే..!

కేసీఆర్ చివరిక్షణంలో మీరెవరంటే..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : టీఆర్ఎస్ తో పొత్తుకు సై అంటూ టీ టీడీపీలో రిటైర్మెంట్ బ్యాచ్ సంకేతాలు ఇవ్వగానే ఇప్పుడు సరికొత్త చర్చకు తెర లేచింది. ఆ పార్టీలో ఫైటింగ్ స్పిరిట్ ఉండీ, రేపటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలవుదామనుకునే వారిలో మెజారిటీ నేతలు కేసీఆర్ తో జట్టుకు ససేమిరా అంటున్నారు. ఇలా ఇప్పటికే రెండు బ్యాచ్ లు తయారు కాగా ఇప్పుడు డోలాయమానం బ్యాచ్ ఒకటి బయలుదేరింది. వీళ్లకు తెలంగాణ రాజకీయాలు పెద్ద అవసరం లేదు. హైదరాబాద్ లో ఉంటూ అమరావతిలో బాబుతో టచ్ లో ఉండే బ్యాచ్ అనమాట. ఇంతకీ పొత్తు పై వీళ్ల మాట ఏమిటో తెలుసా? కేసీఆర్ తో స్నేహం అంటే ఓకే…కానీ, అతనని నమ్మొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు వీళ్లు. వీళ్ల లెక్కలో పొత్తు ఇష్యూనే కాదు…నమ్మకమే ఓష్యూ. పొత్తుల గురించి అడిగితే…లేని పార్టీతో పొత్తేంటి అన్న కేసీఆర్ కామెంట్స్ పై వాళ్లు స్పందిస్తూ…ఆడవారి మాటలకే కాదు, రాజకీయ నాయకుడు…అందులోనూ కేసీఆర్ లాంటి నాయకుడు మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు వారు. మొత్తంగా కేసీఆర్ ను నమ్మేదెలా అన్నది ప్రశ్న. 2009లో సైతం మహాకూటమిలో భాగంగా పొత్తుకు వచ్చి…చివరి నిముషంలో గాయబ్ అయి కొన్ని గంటల పాటు చంద్రబాబుకు ముచ్చెమటలు పుట్టించిన సంఘటనను వాళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా పొత్తు పేరుతో టీ టీడీపీని రిలాక్స్ మోడ్ లోకి తీసుకువెళ్లి…చివరి నిముషంలో మీరెవరు అంటే…అప్పుడు పరిస్థితి ఏమిటీ అన్నది ఈ సోకాల్డ్ గ్రూప్ డౌట్!

Your Comments / Feedback