English Version
  12 Oct, 2017
Home / Latest News / కేజ్రీవాల్ కారు ఎవరో కొట్టేశారు!

కేజ్రీవాల్ కారు ఎవరో కొట్టేశారు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ముఖ్యమంత్రి అంటే భారీ బందోబస్తు. చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది. ఇవి చాలవన్నట్టు ఇటీవల సీసీ కెమెరాల నిఘా కూడా. పైగా ఇంటెలిజన్స్ వ్యవస్థ ఉండనే ఉంది. ఇంతటి నిఘాలో కూడా ఓ ఘనుడు కారును దొంగిలించాడు. అదీ ఎవరో ఆషామాషీ వ్యక్తి కారు కాదు. ఏకంగా ముఖ్యమంత్రి కారుకే టెండర్ పెట్టాడు. ఆ కథేమిటో మీరే చదవండి…. ఆయన ముఖ్యమంత్రి. అదీ దేశ రాజధాని ఢిల్లీకి సీఎం. ఆయనే ఆప్ అధినేత కేజ్రీవాల్. ఆయన కారను ఎవరో దొంగిలించినట్టు తెలిసింది. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం ఆయన తన నీలి రంగు ‘వేగన్ ఆర్’ కారును ఢిల్లీ సచివాలయం వద్ద ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ఆ కారు మాయమైంది. దానిని ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియడం లేదు. ఈ కారును ఆయన ఉద్యమకారుడిగా మారినప్పటి నుంచి వాడుతున్నారు. అందువల్ల దీనిని ఆయన చాలా ప్రేమాభిమానాలతో వాడుకుంటున్నారు.

Your Comments / Feedback