English Version
  3 Oct, 2017
Home / Trending / కవితంటే కేసీఆర్ కు ఎంత ప్రేమో తెలుసా!?

కవితంటే కేసీఆర్ కు ఎంత ప్రేమో తెలుసా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కార్మికుల పై వరాల జల్లు కురిపించారు. అవి ఏ మేరకు అమలవుతాయో తెలియదు కానీ…ఎఫెక్టివ్ ప్రామిసెస్ మాత్రం చేసేశారు. దీనిపై విపక్షాలు విరుచుకు పడ్డాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉండీ హామీలు ఎలా ఇస్తారని వారంతా ప్రశ్నించారు. సీఎం అనైతికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవునూ…నిజంగానే సీఎం అంత స్థాయిలో ఎందుకు దిగివస్తున్నారు? ఆఫ్ట్రాల్ ఓ కార్మిక సంఘం ఎన్నిక కోసం ముఖ్యమంత్రి తన పరపతిని ఎందుకు ఫణంగా పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను మొహరించి అనుక్షణం ఎందుకు మానిటర్ చేస్తున్నారు? మూడేళ్లుగా అమలు చేయలేకపోయిన హామీలకు కొత్తపూత పూసి మళ్లీ ఎందుకు తెర మీదకు వదిలారు లాంటి ప్రశ్నలు ఆసక్తిరేపుతున్నాయి. దీనిపై ఆరా తీస్తే అంతకంటే ఆసక్తికరమైన విషయాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో వెల్లడవుతున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలను కేసీఆర్ డూ ఆర్ డై అన్నట్టుగా తీసుకోవడానికి తన కుమార్తె కవితే కారణమట. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఆమెనే గౌరవ అధ్యక్షురాలు. ఫలితాలు తేడా కొడితే అవి కవిత రాజకీయ భవిష్యత్ పై గట్టి ప్రభావం చూపడం ఖాయం. అందుకే సంఘం కంటే కూతురు మీద ప్రేమతోనే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారన్నది టీఆర్ఎస్ వర్గాల విశ్లేషణ.

Your Comments / Feedback