English Version
  26 Sep, 2017
Home / All in one / కల్వకుంట్ల ఫ్యామిలీకి అవార్డుల పంట !

కల్వకుంట్ల ఫ్యామిలీకి అవార్డుల పంట !

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని పలు అవార్డులు వరిస్తున్నాయి. వివిధ రంగాలలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల సేవలకు ఈ అవార్డులు దక్కుతున్నాయి. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనే ప్రైవేటు సంస్థ సీఎం కేసీఆర్ కు జాతీయ వ్యవసాయ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకు నారీ ప్రతిభ పురస్కార్ పేరుతో మరో అవార్డు లభించింది. తాజాగా కేసీఆర్ కుమారుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు స్కోచ్ అనే సంస్థ ఈ ఏటి మేటి ఐటీ మంత్రిగా అవార్డు ప్రకటించింది. అయితే…కేసీఆర్ కుటుంబానికి లభిస్తోన్న ఈ అవార్డుల పై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డుల గురించి గొప్పలు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ అయితే డబ్బులు తీసుకుని అవార్డులు ఇచ్చే సంస్థలు ఉంటాయని సంచలన విమర్శ చేశారు. రాష్ట్రంలో దిగజారుతోన్న తమ పలుకుబడిని కాపాడుకునేందుకు కేసీఆర్ కుటుంబానికి అవార్డుల పిచ్చి పట్టిందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏది ఏమైనా కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే అవార్డులు వస్తుండటం గమనార్హం.

Your Comments / Feedback