English Version
  9 Oct, 2017
Home / Latest News / కల్వకుంట్ల కుటుంబంలో ఆ ఇద్దరే..!

కల్వకుంట్ల కుటుంబంలో ఆ ఇద్దరే..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ దగ్గర బంధువు, ఆయనకు సర్వం అన్నట్టుగా వ్యవహరించే సంతోష్ రావుకు తొలి సారి పార్టీ పదవి కట్టబెట్టారు గులాబీ బాస్. సంతోష్ ఆది నుంచి కేసీఆర్ వెంటే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. వాస్తవానికి 20 మంది ప్రధాన కార్యదర్శుల్ని వేసినా అందులో సంతోష్ రావే కీలకం. చట్ట సభలకు వెళ్లాలని సంతోష్ చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, రాజ్యసభ లేదా కనీసం ఎమ్మెల్సీ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం తెర మీదకు వచ్చినప్పుడు అక్కడ ఉప ఎన్నిక వస్తే సంతోష్ రావే అభ్యర్థి అవుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సంతోష్ రావును పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ నియమించారు. సంతోష్ ఇంటి పేరు కల్వకుంట్ల కాకపోయినా ఆయన, హరీష్ రావులు కేసీఆర్ కుటుంబ సభ్యుల కిందే లెక్క. ఆ లెక్కన చూస్తే కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్ర కమిటీలో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చినట్టు లెక్క. అందులో అధ్యక్ష హోదాలో కేసీఆర్ ఒకరు కాగా…సంతోష్ రావు రెండో వారు. ఇక మంత్రులెవరినీ కమిటీలో స్థానం ఇవ్వలేదు. కేటీఆర్, కవిత రాష్ట్ర కమిటీలో లేరు.

Your Comments / Feedback