English Version
  1 Oct, 2017
Home / Entertainment & Reviews / కమల్ కు ఇదే చివరి సినిమానా!?

కమల్ కు ఇదే చివరి సినిమానా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : తమిళ నటుడు కమల్ హాసన్ భారతీయుడు అవతారం ఎత్తబోతున్నారు. అదేనండీ…గతంలో ఆయన నటించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు. భారతీయుడు -2 గా ఇది తెరకెక్కబోతోంది. దీనికోసం డైరెక్టర్ శంకర్ ఇప్పటికే కథ సిద్దం చేశారట. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ఈ వార్త సినీ వర్గాలతో పాటు రాజకీయ రంగంలోనూ చర్చనీయాంశంగా మారింది. కమల్ ఇటీవలే తన రాజకీయ రంగ ప్రవేశం పై ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తన ఎజెండా అవినీతి నిర్మూలనే అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారతీయుడు-2 వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయుడులో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్ర్య సమరయోదుడు పాత్రలో కమల్ అద్భుతంగా నటించారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత భారతీయుడు-2 గా రాబోతున్నారు. తన రాజకీయ ప్రవేశ నేపథ్యంలో వస్తోన్న సినిమా కనుక దానికి తగ్గట్టుగానే కథ ఉంటుందంటున్నారు. ఈ సినిమా తర్వాత కమల్ పూర్తి స్థాయిలో రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నారు. మరి ఇదే కమల్ చివరి సినిమా అవుతుందా? లేక రాజకీయ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ కూడా కమల్ సినిమాల్లో నటిస్తారా? అన్నది చూడాలి.

Your Comments / Feedback