English Version
  26 Sep, 2017
Home / Politics / ఔట్ డేటెడ్ స్టార్స్ తో హస్తవాసి మారుతుందా!?

ఔట్ డేటెడ్ స్టార్స్ తో హస్తవాసి మారుతుందా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: వాళ్లిప్పుడు పాత చింతకాయ పచ్చడి. వాళ్లే ఇప్పుడు టీ కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెనర్లట. వాళ్లే సినీ నటి విజయశాంతి, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్. వీళ్లిద్దరినీ టీ కాంగ్రెస్ మళ్లీ తెరమీదకు తెస్తోంది. గత ఎన్నికల్లో విజయశాంతి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అజహర్ అయితే ఏకంగా రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు ఓల్డ్ స్టార్లు సీన్ లో కనిపించలేదు. తాజాగా తమిళనాడు ఏఐడీఎంకే వివాదం నేపథ్యంలో విజయశాంతి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. శశికళను కలిసి మద్దతు తెలిపారు. శశి జైలుకు వెళ్లాక విజయశాంతి మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇక అజహర్ కూడా ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పంచాయితీతో తెర మీదకు వచ్చారు. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి వీరిద్దరితో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. మరి వీళ్లు మళ్లీ ఫాంలోకి వచ్చి ప్రచారాన్ని రక్తికట్టిస్తారా!? ప్రజల దృష్టిలో పాత చింతకాయ పచ్చడిగా మిగిలిపోతారా! చూడాలి.

Your Comments / Feedback