English Version
  10 Oct, 2017
Home / Trending / ఏపీలో బీజేపీ టార్గెట్ తెలుసా..!

ఏపీలో బీజేపీ టార్గెట్ తెలుసా..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : పీకల్లోతు కేసుల్లో ఇరుకున్న జగన్ ను కేంద్రం ఎందుకు సేఫ్ జోన్ లో ఉంచుతోంది? సీబీఐ కేసుల విచారణ వేగవంతం చేసి…ఏడు ఊచలు లెక్కపెట్టించ వచ్చు కదా!? ఏపీలో సగటు టీడీపీ కార్యకర్త నుంచి ఓ మోస్తరు నాయకుడు వరకు అడిగే ప్రశ్న ఇదే. అయితే, జగన్ ను కటకటాల వెనక్కు పంపితే బీజేపీకి వచ్చే లాభం ఏమిటి? ఇది ఢిల్లీ బీజేపీ పెద్దలు మనసులో వేసుకునే ప్రశ్న. పైగా జగన్ జైలుకు వెళితే చంద్రబాబుకు పట్టపగ్గాలు ఉంటాయా? అందుకే ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆడే చదరంగంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ పావులే. జగన్ ను చూపించి చంద్రబాబును, చంద్రబాబును చూపించి జగన్ ను ఆడించాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అంటే…ఒక ఒరలో రెండు కత్తులనమాట. ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో బద్ద విరోధులిద్దరూ బీజేపీకి జై కొట్టారు. చంద్రబాబు తమకు అధికారిక భాగస్వామి అయినప్పటికీ వాళ్లు జగన్ మద్దతు తీసుకోవడానికి వెనకాడలేదు. 2019 ఎన్నికలలో ఏపీలో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతోందో దీనిని బట్టే అర్థమవుతోంది. బీజేపీకి ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల పై పెద్దగా ఆశలు లేవు. 2019లో తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యం. దాని కోసం ఎన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించగలమన్నది లెక్క. ఏపీలో టీడీపీ అంత కాకపోయినా వైసీపీ బలంగానే ఉంది. హీనపక్షం అయిదు నుంచి పది ఎంపీ సీట్లు ఆ పార్టీ గెలవడం ఖాయం. ఒకవేళ టైం బాగోకపోతే ఆ అయిదు పది సీట్లు కూడా బీజేపీకి అవసరపడతాయి. అందుకోసమే జగన్ ను కేసులతో ఫినిష్ చేయకుండా బీజేపీ కాలయాపన చేస్తోందని టీడీపీ వర్గాలు డౌట్ పడుతున్నాయి. అంటే ఇటు టీడీపీ, అటు వైసీపీ ఖాతాలో ఉండే 25 ఏంపీ సీట్లు తమకే కావాలన్నది బీజేపీ ఆశ. మధ్యలో పవన్ ఒకటో రెండో గెలిస్తే ఏంటి పరిస్థితి? కాలం కలిసి వచ్చి చంద్రబాబు తోకజాడిస్తే కమలం ఏం కావాలి? ఈ ప్రశ్నలకు కూడా ఢిల్లీ కమలనాథులు సమాధానాలు వెతుక్కుంటే మంచిది!

Your Comments / Feedback