English Version
  10 Oct, 2017
Home / All in one / ఏపీలో ఆ నాలుగు కంపెనీలదే హవా!

ఏపీలో ఆ నాలుగు కంపెనీలదే హవా!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : కొత్త ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ ను పునర్ నిర్మించే పనిలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. రాజధాని, పోలవరం, వాటర్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ప్రభుత్వం మౌలిక సదుపాయాల పై ఖర్చు చేయబోతోంది. దీంతో కాంట్రాక్టర్లంతా ఏపీ వైపు పరుగులు పెడుతున్నారు. పనులు సొంతం చేసుకుని మెగా కంపెనీలుగా ఎదిగేద్దామని క్యూలు కడుతున్నారట. అయితే…ఓ నాలుగు కంపెనీల హవా ముందు ఇతరులెవరూ నిలబడలేకపోతున్నారని సమాచారం. ఎల్ అండ్ టీ, షాపోర్ జీ పల్లోంజీ, మెగా ఇంజనీరింగ్, ఎన్సీసీ ఈ నాలుగు కంపెనీల కనుసన్నల్లోనే పనులన్నీ జరుగుతున్నాయంటున్నారు. ఓ మాదిరి వర్క్ ఏదీ ఈ నలుగురునీ దాటి బయటకు పోయే పరిస్థితి లేదట. ఈ నాలుగు కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించేవే… అందులో సందేహం లేదు. కాకపోతే వాటికి అటు ఇటుగా పనితీరు కనబరిచే కంపెనీలు మరికొన్ని ఉన్నాయి. అర్హతల పరంగా చూసినా ఆ కంపెనీలు కూడా పనులు దక్కించుకోగలవట. అయితే…పెద్దల ఆశీస్సు మాత్రం ఆ నాలుగు కంపెనీలకు మాత్రమే ఉండటంతో మిగతా వారు ఉసూరు మంటున్నారని చెబుతున్నారు. సబ్ కాంట్రాక్టులే తప్ప…ఈ నలుగురుని కాదని నేరుగా వర్క్ లు తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమేనట.

Your Comments / Feedback