English Version
  4 Oct, 2017
Home / Politics / ఎంతపని చేశావ్ మోత్కుపల్లి!

ఎంతపని చేశావ్ మోత్కుపల్లి!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : సమయం, సందర్భం లేకుండా మాట్లాడే మాటలు రాజకీయాల్లో పరిస్థితులను తారుమారు చేసేస్తాయి. తాజాగా టీడీపీ నేత మోత్కుపల్లి చేసిన కామెంట్స్ అలాగే ఉన్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఓ వైపు విపక్షాలు కూటమి కట్టి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సింగరేణి బరిలో నిలిచారు. 2019 పొత్తుల సంగతి ఎలా ఉన్నా ఇప్పటికి అధికారపక్షం పై పోరాటం టీడీపీకి కూడా అనివార్యమే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించడం కష్టం. ముందు అస్థిత్వం నిలుపుకుంటే తర్వాత అధికారం గురించి ఆలోచించడం సముచితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అటు వామపక్షాలు, ఇటు కాంగ్రెస్ లతో జతకట్టి టీఆర్ఎస్ పై ఫైట్ చేస్తోంది. సింగరేణిలో అధికారపక్షానికి ధీటుగా ఈ ముగ్గురు పోరును ఓ స్థాయికి తెచ్చారు. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు టీఆర్ఎస్ తో పొత్తుకు సై అంటూ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రయత్నాలను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చాయంటున్నారు. మోత్కుపల్లి వ్యాఖ్యలతో ఈ ఎన్నికల్లో కూటమి పై అనుమానాలు రేగి, టీఆర్ఎస్ కు మేలు చేశాయని సీపీఐ నేతలు వాపోతున్నారు. 2019లో ఒకవేళ టీఆర్ఎస్ పొత్తుకు వెళ్లాలన్నా అప్పటికి టీడీపీ ఓ మోస్తరు అస్థిత్వంతో ఉండాలి. ఇప్పటి నుంచే టీఆర్ఎస్ కు అనుకూలవైఖరి తీసుకుంటే ఆ రోజుకు టీఆర్ఎస్ పట్టించుకుంటుందా అన్నది ప్రశ్న!.

Your Comments / Feedback