English Version
  8 Oct, 2017
Home / Latest News / ఇక మొహమాటం దేనికి!?

ఇక మొహమాటం దేనికి!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: తెరలు తొలిగాయి. డైరెక్ట్ గా పెద్దలే రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరాంలు నేరుగా టార్గెట్ చేసుకున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్ అనుచరగణం మాత్రమే కోదండరాం పై విరుచుకు పడేది. కోదండరాం కూడా కేసీఆర్ ను నేరుగా కాక ఇష్యూలతో ఇరిటేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఫేస్ టు ఫేస్ అయిపోయారు. ఇక ఎవరో విరుచుకు పడటం కాదు…అటూ ఇటూ కొండ శిఖరాలే విరిగి పడుతున్నాయి. నిన్నటి కేసీఆర్ కామెంట్స్ పై కోదండ కూడా కేసీఆర్ స్థాయిలో కాకపోయినా గతానికి భిన్నంగానే స్పందించారు. నా సభలకు 500 మంది కూడా రాకపోతే కేసీఆర్ కు అంత రంధి దేనికని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని స్ట్రెయిట్ గా టార్గెట్ చేశారు. సీఎం తెలంగాణను తన జాగీర్ధార్ అన్నట్టుగా పాలిస్తున్నారన్నారు. జిల్లాల ఏర్పాటును తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ఎవనిపాలయిందిరో తెలంగాణ పాట మూడేళ్ల అనుభవాల నుంచే పుట్టుకొచ్చిందన్నారు. బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణ అయ్యిందని చెప్పుకొచ్చారు. మొత్తంగా తన రూటు టీఆర్ఎస్ వ్యతిరేకమని మరింత స్పష్టంగా కుండబద్దలు కొట్టారు ప్రొఫెసర్. ముందు ముందు ఇది ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.

Your Comments / Feedback