English Version
  26 Sep, 2017
Home / Politics / ఆ పని చేసి మొఖం చూపించండి.!

ఆ పని చేసి మొఖం చూపించండి.!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: తెలంగాణలో సెప్టెంబర్ 15 నుంచి తలపెట్టిన సమగ్ర భూ సర్వేను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణ ప్రాంతంలో తొలిసారి భూముల రికార్డులు సరిచేయబోతున్నారు. ఇంతటి భృహత్తర కార్యక్రమం కావడంతో ఏ మాత్రం తేడా వచ్చినా అది ప్రభుత్వం, కేసీఆర్ ఇమేజ్ అంతిమంగా టీఆర్ఎస్ పార్టీకి ఘోరమైన పరిణామంగా సంభవించడం ఖాయం. అదే సమయంలో విజయవంతమైన పక్షంలో కేసీఆర్ ఇమేజ్ అదే స్థాయిలో పెరగడం అంతే సహజం. ఇలా రెండువైపులా పదునున్న కత్తి కావడంతో భూ సమగ్ర సర్వేలో ఎక్కడా తేడా రాకుండా, మూడు నెలలు ఓ యజ్ఞంలా జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఇందులో అధికార యంత్రాంగంతో పాటు టీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా సీఎం భాగస్వామ్యం చేయదలచుకున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతి ప్రజాప్రతినిధి మూడు గ్రామాలను ఎంచుకుని భూ సర్వే సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమం ముగిసే వరకు వచ్చే మూడు నెలలు ప్రజాప్రతినిధులెవరూ హైదరాబాద్ కు రావద్దని, తనకు కనిపించవద్దని సీఎం ఆదేశించారు.

Your Comments / Feedback