English Version
  8 Oct, 2017
Home / Latest News / ఆ చర్చ ఇప్పుడెందుకయ్యా..?

ఆ చర్చ ఇప్పుడెందుకయ్యా..?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : పొత్తుల పై చర్చలకు ప్రస్తుతానికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు. తెలంగాణలో పొత్తు గురించి పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని తేల్చి చెప్పారు. అవసరమైతే టీఆర్ఎస్ తో పొత్తుకు సిద్దమని, నాలుగు రోజుల క్రితం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే.

దానిపై పార్టీలో పెద్ద దుమారమే రేగింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోన్న చాలా మంది నేతలు మోత్కుపల్లి కామెంట్స్ పై నారాజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో బాబుతో మీటింగ్ జరిగింది. పరిస్థితులను అంచనా వేసుకున్న బాబు పొత్తుల పై నోరు జారొద్దని ఒకింత గట్టిగానే హెచ్చరించారట. అంత మాత్రాన టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని కాదట, అలాగని ఉంటుందనీ గ్యారెంటీ లేదట. దీన్నే ఇంకా సస్పెన్స్ వీడలేదు అంటారు.

Your Comments / Feedback