English Version
  3 Oct, 2017
Home / Trending / ఆ ఇద్దరిలో ఎవరు గవర్నర్!?

ఆ ఇద్దరిలో ఎవరు గవర్నర్!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుని మూడున్నరేళ్లుగా ఊరిస్తున్న గవర్నర్ పదవి ఇక అందని ద్రాక్షే అయ్యేట్టుంది. మోత్కుపల్లికి గవర్నర్ అనే మాటను ఇక మరచిపోవడం మంచిదంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు పలు సార్లు చెప్పిన తర్వాత కూడా మోత్కుపల్లి పదవికి మోక్షం లభించలేదు. తాజాగా అయిదు రాష్ట్రాలకు గవర్నర్ లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాలో మోత్కుపల్లి పేరు లేదు. పైగా ఆయనకు ఏయే రాష్ట్రాలలో చాన్స్ ఉందంటూ ప్రచారం జరిగిందో ఆయా రాష్ట్రాల గవర్నర్ పదవులు భర్తీ అయ్యాయి. అయినా…మోత్కుపల్లికి అవకాశం రాలేదు. ఎందుకు ఇలా జరిగిందా అని టీ టీడీపీ పోస్ట్ మార్టం చేసింది. అందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లికి పదవి ఎలా ఇస్తారన్నది ప్రశ్న. మోత్కుపల్లికి గవర్నర్ ఇస్తే…అది తెలంగాణ కోటా, టీ టీడీపీ కోటా అవుతుంది. ఈ పరిస్థితుల్లో అలా చేస్తే టీ టీడీపీతో ఇంకా స్నేహం చేస్తున్నట్టుగానే లెక్క. అది టీ బీజేపీ నేతలకు ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా ఇటీవలే దత్తాత్రేయను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించారు. గవర్నర్ ఇస్తామని హామీ ఇచ్చే ఆయన చేత మంత్రి పదవికి రాజీనామా చేయించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత దత్తాత్రేయకు ఏదో ఒకటి చేయకుండా మోత్కుపల్లికి అవకాశం ఇవ్వడం అంటే అయినవాళ్లకు ఆకులు…కానివాళ్లకు కంచాలు అన్న సామెతలా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. పైగా దత్తాత్రేయను తొలగించడం పై తెలంగాణ లో ఆయన పట్ల సానుభూతి వ్యక్తమైంది. అయ్యో…దత్తన్నను తప్పించారేంటని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ ఈక్వేషన్స్ లెక్కేస్తే మోత్కుపల్లికి పదవి అన్నది కలేనంటున్నాయి టీడీపీ వర్గాలు.

Your Comments / Feedback