English Version
  6 Oct, 2017
Home / Latest News / ఆ ఇద్దరినీ కేసీఆర్ ఏం చేస్తారో!?

ఆ ఇద్దరినీ కేసీఆర్ ఏం చేస్తారో!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సర్వం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవిత కనుసన్నల్లోనే జరిగాయి. మొత్తంగా సంఘం గెలుపోటములలో వీరిద్దరిదే కీలక బాధ్యత.
అయితే, స్థానికంగా టీఆర్ఎస్ నేతల పాత్ర కూడా ఇందులో కీలకమే. ఆ రకంగా చూసుకుంటే ఇద్దరు ముఖ్య నేతలకు ఈ ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అందులో ఒకరు అసెంబ్లీ స్పీకర్ మధుసుదనా చారి కాగా, మరొకరు ఎమ్మెల్యే నల్లాల ఒదేలు. వీరిద్దరు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాలలోని భూపాలపల్లి, మందమర్రిలలో ఏఐటీయూసీ విజయం సాధించింది. అది కూడా మంచి మెజారిటీతోనే. దీంతో రాజకీయంగా ఆ ఎఫెక్ట్ ఈ ఇద్దరి నేతల పైన పడే అవకాశం ఉంది. మధు సుదనా చారి స్పీకర్ గా ఉన్నారు కనుక సింగరేణి ఎన్నిలను నేరుగా పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఓదేలు విషయం అలా కాదు. ఏది ఏమైనా ఈ ఫలితాలతో వీరిద్దరు బలహీనంగా ఉన్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. మరి 2019 ఎన్నికల్లో వీళ్ల రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది కేసీఆర్ తేల్చాలి.

Your Comments / Feedback