English Version
  26 Sep, 2017
Home / Politics / ఆ ఇంట్లో నాలుగు గంటలు కేసీఆర్ ఏం చేశారు!?

ఆ ఇంట్లో నాలుగు గంటలు కేసీఆర్ ఏం చేశారు!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు మధ్య విభేదాలు వచ్చాయని అంతా భావించారు. కేసీఆర్ తనను కాదని ప్రతిమా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇస్తున్నారని సదరు పారిశ్రామిక వేత్త తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే…ఆ పుకార్లన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ముఖ్యమంత్రి వద్ద సదరు పారిశ్రామిక వేత్త పలుకుబడి ఏ మాత్రం తగ్గలేదని తేలిపోయింది. ఆయనే మై హోం రామేశ్వరరావు. తాజాగా మైం హోం ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లినట్టు తెలిసింది. ఎలాంటి ప్రత్యేక సందర్భం లేకున్నా సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. గత శుక్రవారం నందగిరి హిల్స్ లోని రామేశ్వరరావు ఇంట్లో సీఎం నాలుగు గంటల సేపు గడిపారట. మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లిన కేసీఆర్ సాయంత్రం అయిదు గంటల వరకు అక్కడే ఉన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఇరువురు ప్రముఖుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. సహజంగా రాజకీయాలు, కుటుంబం, వ్యాపారానికి సంబంధించిన అంశాలన్నీ చర్చకు వచ్చి ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ విషయం అలా ఉంచితే టీఆర్ఎస్ చీఫ్ వద్ద మై హోం పలుకుబడి ఏ మాత్రం తగ్గలేదనడానికి ఈ సంఘటనే నిదర్శనంగా జూబ్లిహిల్స్ బిగ్ షిట్స్ చెబుతున్నారు.

Your Comments / Feedback