English Version
  1 Oct, 2017
Home / All in one / ఆ ఇంట్లో జగన్ కు ఏం నచ్చింది. !

ఆ ఇంట్లో జగన్ కు ఏం నచ్చింది. !

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : వైసీపీ అధినేత జగన్, బీజేపీ నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఇంటికి వెళ్లారు. గంటన్నర సేపు ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు గంగరాజును ఆరా తీయగా…”జగన్ వచ్చింది నిజమే అయితే, అందులో రాజకీయ ప్రాధాన్యత లేదు…మేం కొత్తగా కట్టుకున్న ఇల్లు ఎలా ఉందో చూడడానికి వచ్చాడు…అంతే!” అని చెప్పారట. వెటకారం కాకపోతే…జగన్ చూడని ఇల్లా అది? ఆయన లోటస్ పాండ్ లో కట్టుకున్న ఇంటిలో ఏ పాటిది? బెంగుళూరు భవనాలను చూసిన జగన్ కొత్తగా గోకరాజు ఇంటిని చూసేదేముంటుంది!! ఆ విషయం అటుంచితే…ఈ ఇరువురి మధ్య రాజకీయ చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో అవగాహనతో వెళ్లే ఉద్దేశంలో జగన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కనిపిస్తోన్న పొలిటికల్ సిశ్చ్యూవేషన్ ప్రకారం 2019 లో కూడా మోదీనే వస్తారని టాక్. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ – బీజేపీ మధ్య తాను దూరే ఉద్దేశంలో జగన్ ఉన్నట్టు అనిపిస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సాయంతోనే చంద్రబాబు నెట్టుకొస్తున్నారన్న భావనలో జగన్ ఉన్నారు. బీజేపీతో బాబుకు వ్యవహారం బెడిసికొడితే…కేంద్ర సాయం అందక విలవిలలాడే పరిస్థితి ఉంటుందని…అది రాజకీయంగా తనకు లాభిస్తుందని జగన్ అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఏపీలో బాబు ఆశలన్నీ పోలవరం, రాజధాని నిర్మాణం పైనే పెట్టుకున్నారు. ఈ రెంటికీ కేంద్రం నుంచి సహకారం కావాల్సిందే. దానికి గండికొడితే చంద్రబాబును దెబ్బతీయడం తేలికవుతుందని జగన్ అంచనా వేస్తున్నారట. దానిలో భాగంగానే పదేపదే బీజేపీ పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు వైసీపీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. “మా నాయకుడి వైఖరి చూస్తుంటే తాను సీఎం కావడం కంటే…చంద్రబాబును దెబ్బతీయడమే ప్రాధాన్యతగా కనిపిస్తోంది. అందుకే పార్టీకి పెట్టనికోటగా ఉన్న ముస్లీం, క్రిస్టియన్ ఓటు బ్యాంకును విస్మరించి మరీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు” అని ఓ వైసీపీ నేత వాపోయారు.

బీజేపీకి దగ్గరవ్వాలన్న ఆలోచనలో టీడీపీ ప్రభుత్వాన్ని ఆర్థిక సంకట పరిస్థితిలోకి నెట్టడంతో పాటు, తన కేసుల వ్యవహారం నుంచి ఊరట పొందాలన్న ఉద్దేశం కూడా ఉందని చెబుతున్నారు. నవంబర్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి రావడం ఈ యాత్రకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ గంగరాజును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరిద్దరి మధ్య ఇరుపార్టీలు కలిసి పని చేసే అంశం కూడా చర్చకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బీజేపీతో కలిసేందుకు జగన్ పెద్ద త్యాగమే చేయడానికి సిద్దపడినట్టు చెబుతున్నారు. ఏపీలో ఉన్న 25 ఎంపీలలో 20సీట్లు, 175 అసెంబ్లీలలో 50 సీట్లు 2019లో బీజేపీకి పొత్తులో భాగంగా ఇవ్వడానికి ఆయన సిద్దపడినట్టు చెబుతున్నారు.

Your Comments / Feedback