English Version
  26 Sep, 2017
Home / All in one / ఆవిడ బాబుగారి దేవత!!

ఆవిడ బాబుగారి దేవత!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ముక్కోటి దేవతల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో దేవతను చేర్చారు. ఇక పై అందరూ తాను సృష్టించిన దేవతను పూజించాలని ఓ చిన్న సైజు ఆర్డర్ లాంటి సూచన కూడా చేశారు. ఆ దేవతకు ‘జలసిరి’ అని పేరు కూడా పెట్టారు చంద్రబాబు. చంద్రబాబు సృష్టించేదేమిటీ…సహజంగానే హిందూ సాంప్రదాయం ప్రకారం నదులన్నీ దేవతలేగా అంటారా!? అవుననుకోండి…కాకపోతే ఇప్పటి వరకు గంగా, యమున, కృష్ణా, గోదావరి ఇలా మనం ఏ నదికి ఆ నదిని విడివిడిగా గుర్తించాం. ఏ నదికి ఆ నదికి విడివిడిగా పూజలు, పుష్కరాలు కూడా చేస్తుంటాం. ఇప్పుడు బాబు వాటన్నింటినీ కలగలిపి కొత్త దేవతను తెర మీదకు తెచ్చారు. ఇకపై అందరూ ‘జలసిరి’కి పూజలు చేయాలని సూచించారు. మిగతా దేవతల సంగతి ఏమోకానీ ఇప్పుడు ఏపీలో ఆఫీషియల్ దేవత ఎవరంటే ‘జలసిరే’. బాబుగారి అధికారిక ముద్రతో పురుడుపోసుకున్న దేవత కనుక ఎవరైనా పూజించాల్సిందే. అందుకే ఇప్పుడు ఏపీలో కొత్త పూజలు మొదలయ్యాయి. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల మాదిరిగా ‘జలసిరికి హారతి’ పూజలు మొదలయ్యాయి. ఆ పూజల విధానమెట్టిదన్నది స్వయంగా ముఖ్యమంత్రే పూజల క్రతువు నిర్వహించి అందరినీ ఫాలో అవమన్నారు. మొత్తానికి ఏపీలో ప్రజలు నీళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం బాబు ఇలా ప్లాన్ చేశారట!!

Your Comments / Feedback