English Version
  26 Sep, 2017
Home / Politics / ఆపరేషన్ ‘కన్ను’!! దత్తన్న ఔట్…మరి ఇన్..? కేబినెట్ హడావుడి వేళ ఢిల్లీకి కేసీఆర్.

ఆపరేషన్ ‘కన్ను’!! దత్తన్న ఔట్…మరి ఇన్..? కేబినెట్ హడావుడి వేళ ఢిల్లీకి కేసీఆర్.

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి ఆపరేషన్ వ్యవహారం ఓ పెద్ద పజిల్ గా మారింది. ఇప్పటికే కంటి ఆపరేషన్ పేరుతో కేసీఆర్ మూడు, నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. వెళ్లిన ప్రతిసారీ అటు ఇటుగా వారం రోజులు అక్కడే మకాం వేస్తున్నారు. ఇదిగో అదిగో అనడం…ఆపరేషన్ వాయిదా పడిందని తిరిగి రావడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కేసీఆర్ మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ సారి కూడా కంటి ఆపరేషన్ కోసమే ఆయన ఢిల్లీకి వెళుతున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ, పర్యటన పై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కసరత్తు జరుగుతున్న తరుణంలో కేసీఆర్ పర్యటన పలు ఊహాగానాలకు తావిస్తోంది. తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిథ్యం వహిస్తోన్న బండారు దత్తాత్రేయకు ఉధ్వాసన పలికారు. ఆయనకు గవర్నర్ గా అవకాశం ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి బీజేపీ తరపున మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి మరో ఎంపీ లేరు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి అన్న ప్రశ్న సహజంగానే రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ నుంచి అసలు ప్రాతినిథ్యమే లేకుండా ఉండటమా లేక టీ టీడీపీ, టీఆర్ఎస్ ల నుంచి ఎవరైనా ఒకరికి అవకాశం కల్పించడమో చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో టీడీపీతో పొత్తుకే సిద్ధంగా లేని బీజేపీ ఇక్కడ వారికి మంత్రి పదవి ఇస్తుందనుకోవడం హాస్యాస్పదమవుతుంది. ఇస్తే టీఆర్ఎస్ కు లేదా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యమే లేకుండా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంటి ఆపరేషన్ పేరుతో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. తాము కేంద్ర కేబినెట్ లో చేరేది లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి కొద్ది రోజుల ముందు ప్రకటించడం గమనార్హం. ఆదివారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ఆ లోపే ఈ సందేహాలకు తెర పడవచ్చు. శనివారం సాయంత్రానికి క్లారిటీ రావచ్చు!

Your Comments / Feedback