English Version
  26 Sep, 2017
Home / All in one / అవార్డులు టాం…టాం…టాం! ఐటీ ఢాం…ఢాం…ఢాం!!

అవార్డులు టాం…టాం…టాం! ఐటీ ఢాం…ఢాం…ఢాం!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: “అవార్డుల యందు ఐటీ అవార్డులు వేరయా విశ్వదాభిరామ…వినుర వేమా.” ఇదేమిటీ! మొదలు పెట్టీ పెట్టడంతోనే వేమన పద్యం అనుకుంటున్నారా? అదే మరి. ఓ వైపు రాష్ట్రానికి ఎడా పెడా అవార్డులు వచ్చి పడుతున్నాయ్. నిన్నో మొన్నో మన స్టైలిష్ మంత్రి కేటీఆర్ కు ఓ స్టార్ అవార్డు వచ్చింది. ఆయనను ఈ ఏటి మేటి ఐటీ మంత్రి అవార్డు వరించింది. స్కోచ్ అనే సంస్థ ఏరికోరి రామారావు సారుకు అవార్డు ఇచ్చింది. దేశంలో అద్భుత మైన ఐటీ పాలసీలతో అదరగొడుతున్నందుకే ఈ అవార్డు వరించిందట…దీంతో తెలంగాణ సమాజం అబ్బురపడింది. మన యువనేత గతంలో యూఎస్ లో పని చేయడం…ఐటీలో లోతుపాతులు తెలిసుండటం వల్లనే పసి రాష్ట్రమైనప్పటికీ పతకాలు వరించినాయని అంతా భావించారు. కానీ, యవ్వారం అంతా మేడిపండేనని తేలిపోతోంది. కడుపు చించుకుంటే కాళ్లమీద పడతదంటారు. అదే విషయం చెప్పింది ‘ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్’ అనే సంఘం. ఈ ఏడాది హైదరాబాద్ లో ఇప్పటికే 25 వేల మంది ఐటీ వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించేశారట. సహేతుక కారణాలు చూపకుండానే జాబ్ ల నుంచి గెంటి వేస్తున్నాయట కంపెనీలు. దేశ చట్టాలను గౌరవించని కంపెనీలు ఈ దేశాన్ని వదిలి వెళ్లాలని ఆ ఫోరం సరికొత్త డిమాండ్ ను తెర మీదకు తెచ్చింది. ఇలా ఉద్యోగుల తొలగింపు పై ఇప్పటికే లేబర్ కమిషనర్ వద్ద 1600 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయట. గడచిన మూడేళ్లలో ఇలా లక్షమందిని ఐటీ కంపెనీలు తొలగించాయని సదరు ఫోరం లెక్క తేల్చింది. ఇదంతా మా లెక్క కాదండోయ్…’ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్’ అనే సంస్థ ప్రెస్ మీట్ పెట్టి మరీ తేల్చిన లెక్క ఇది. పరిస్థితి ఇలా ఉంటే “ఐటీలో మేటి” అవార్డు ఎలా వచ్చిందంటారు!! అది మీరు అడగకూడదు…మేం చెప్పకూడదు.

Your Comments / Feedback