English Version
  9 Oct, 2017
Home / Latest News / అద్దె అడిగితే చెప్పుతో కొడతానన్నాడు!

అద్దె అడిగితే చెప్పుతో కొడతానన్నాడు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఎన్ఆర్ఐ ఫ్లాట్ లో అద్దెకు ఉంటున్న హుస్సేన్ అద్దె కట్టకపోగా ఇంటి యజమాని పై దౌర్జన్యానికి దిగారు. సోమవారం ఇంటి అద్దె అడగడానికి ఫ్లాట్ కు వెళ్లిన యజమానికి చెప్పు చూపించారు ఎమ్మెల్సీ. దీంతో వివాదం రాజుకుంది. బాధిత ఎన్ఆర్ఐ అంతుల్ వాసే దీనిపై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫారూఖ్ బూతులు తిడుతూ, చెప్పుతో దాడి చేయబోయాడని ఆమె ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఫ్లాట్ ఖాళీ చేయడం లేదని, ఆరు నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని బాధితురాలు ఆరోపించారు. అంతులే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Your Comments / Feedback