English Version
  26 Sep, 2017
Home / Entertainment & Reviews / అటు చిరు-ఇటు బాలయ్య మధ్యలో అమితాబ్ !

అటు చిరు-ఇటు బాలయ్య మధ్యలో అమితాబ్ !

For Advertisements, Contact here : 8074030036

  • తెలంగాణ పోస్టర్.కాం: లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాలో నటనకు ముహూర్తం పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రగా తెరకెక్కబోతున్న ‘సైరా-నర్సింహారెడ్డి’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అమితాబ్ పేరు పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. నర్సింహారెడ్డి కి మార్గనిర్ధేశకుడైన గోసాయి వెంకన్న పాత్రకు అమితాబ్ అతికినట్టు సరిపోతారన్నది డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావన అట. ప్రొడ్యూసర్ రాం చరణ్ తో కూడా ఈ ప్రతిపాదన పై చర్చించినట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే సైరా-నర్సింహారెడ్డిలో గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ రక్తికట్టిస్తారనడంలో సందేహం లేదు. ఆ మధ్య నందమూరి బాలకృష్ణ 101 చిత్రంలో అమితాబ్ నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. రైతు పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమాలో రాష్ట్రపతి పాత్రకు అమితాబ్ ను ఎంపిక చేసుకున్నారు. దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు…ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇంతలో సైరాలో అమితాబ్ ను నటింపజేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.

Your Comments / Feedback